ముదిరాజ్ సంఘం మండల అధ్యక్షుడిగా కొత్తగట్టు రాజేందర్ ఎన్నిక
కాకతీయ, గీసుగొండ: తెలంగాణ ముదిరాజ్ మహాసభ సంఘ మండల అధ్యక్షుడిగా కొత్తగట్టు రాజేందర్‌ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. మండలంలోని మచ్చాపూర్ గ్రామంలో కంబాల కోటి ఆధ్వర్యంలో తెలంగాణ ముదిరాజ్ మహాసభ జిల్లా కార్యవర్గ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి జిల్లా అధ్యక్షులు పొన్నం మొగిలి, జిల్లా ప్రధాన కార్యదర్శి నీరటి సదానందం, మత్స్య శాఖ చీఫ్ ప్రమోటర్ చొప్పరి సోమయ్య, జిల్లా యువజన అధ్యక్షులు పోలు అమర్ చంద్ హాజరై అధ్యక్షత వహించారు.ఈ సందర్భంగా మండల కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకోగా, మండల అధ్యక్షుడిగా కొత్తగట్టు రాజేందర్, ఉపాధ్యక్షుడిగా ఎంబాడి పరమేశ్వర్,ప్రధాన కార్యదర్శిగా దూల మహేందర్, యువజన సంఘ అధ్యక్షుడిగా మేకల రాజు,యువజన సంఘ ప్రధాన కార్యదర్శిగా కంబాల రాజమౌళిని ఎంపిక చేశారు. ఈ కార్యక్రమంలో ముదిరాజ్ కుల సంఘం నాయకులు ఎంబాడి నరసింహ స్వామి, ఎంబాడి సారంగం, బోనాల అశోక్,ఆలేటి సాంబమూర్తి, జూల రమేష్,మంద రమేష్, నకినబోయిన నాగరాజు, మండల నాగరాజు తది తరులు పాల్గొని నూతన కార్యవర్గానికి శుభాకాంక్షలు తెలిపారు.


