కటిక బీద వర్గాలకు సహాయం అందించాలి
మాజీ విద్యాశాఖ అధికారి డాక్టర్ ప్రభు దయాల్
వృద్ధులకు దయాల్ దుస్తులు పంపిణీ
కాకతీయ, కొత్తగూడెం : నూతన సంవత్సర వేడుకలను అందరూ హంగు ఆర్భాటాలతో నిర్వహించుకోగా కొత్తగూడెం మాజీ మండల విద్యాశాఖ అధికారి డాక్టర్ ప్రభుదయాల్ మాత్రం తాను నివసించే విద్యానగర్ కాలనీకి చెందిన వృద్ధ, బీద వితంతువులను గుర్తించి గురువారం వారికి నూతన చీరలు, బిర్యానీ ఆహారాన్ని అందించారు. ఏదైనా అత్యవసర సహాయం అవసరమైతే తన శక్తి మేరకు సహాయం చేస్తూ వారికి అండగా నిలవడం జరుగుతుందని డాక్టర్ ప్రభు దయాల్ పేర్కొన్నారు.


