చత్రపతి శివాజీ విగ్రహానికి నిప్పు
నూతన విగ్రహం ప్రారంభానికి ముందు దుండగుల దుశ్చర్య
రాయపర్తి మండలంలో ఘటన
కాకతీయ, రాయపర్తి : చత్రపతి శివాజీ విగ్రహానికి గుర్తు తెలియని వ్యక్తులు నిప్పటించారు. ఈసంఘటన వరంగల్ జిల్లా రాయపర్తి మండలం బంధనపల్లి గ్రామంలో బుధవారం తెల్లవారుజామున జరిగింది.

గ్రామంలో నూతనంగా ఏర్పాటుచేసిన చత్రపతి శివాజీ విగ్రహం పనులు పూర్తయి విగ్రహావిష్కరణకు సిద్ధంగా ఉంచారు. ఈక్రమంలోనే బుధవారం తెల్లవారుజామున గుర్తు తెలియని వ్యక్తులు విగ్రహానికి నిప్పు పెట్టడం కలకలం రేపుతోంది. ఈ ఘటనకు పాల్పపడ్డ ఆకతాయిలను గుర్తించి కఠినంగా శిక్షించాలని గ్రామస్థులు పోలీసులను కోరుతున్నారు. ఈ ఘటనతో ఒక్కసారిగా గ్రామంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.


