పాఠశాల అభివృద్ధికి చేయూత ఇవ్వాలి
నూతన పంచాయతీ పాలకవర్గానికి విజ్ఞప్తి
పడమటిగూడెం పాఠశాలపై దృష్టి
పాలకవర్గ సభ్యులకు సన్మానం
ఎన్రోల్మెంట్ పెంపుపై సూచన
కాకతీయ, నర్సింహులపేట : పడమటిగూడెం ప్రభుత్వ పాఠశాల అభివృద్ధికి గ్రామపంచాయతీ నూతన పాలకవర్గం సహకరించాలని పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఎర్ర పూర్ణచందర్ కోరారు. సోమవారం గ్రామపంచాయతీ నూతన కార్యవర్గ సభ్యులను పాఠశాల తరఫున సన్మానించారు. ఈ సందర్భంగా సర్పంచ్ జక్కుల ఉప్పలయ్య, ఉపసర్పంచ్ నవీన్ రెడ్డి, వార్డు సభ్యులు శ్రీశైలం, సునీల్ రెడ్డి, యాకయ్య తదితరులను ఘనంగా సత్కరించారు. అనంతరం ప్రధానోపాధ్యాయులు పూర్ణచందర్ మాట్లాడుతూ, గ్రామంలోని ప్రతి విద్యార్థి ప్రభుత్వ పాఠశాలలోనే చదివేలా ప్రోత్సహించాలని తెలిపారు. పాఠశాలలో విద్యార్థుల సంఖ్య పెరగాలంటే గ్రామపంచాయతీ సహకారం ఎంతో కీలకమన్నారు.
అభివృద్ధికి సహాయ సహకారాలు
పాఠశాల మౌలిక సదుపాయాల అభివృద్ధి, విద్యా ప్రమాణాల మెరుగుదల కోసం పంచాయతీ పాలకవర్గం తోడ్పాటు అందించాలని కోరారు. ప్రభుత్వ పాఠశాల బలోపేతానికి అందరూ భాగస్వాములవ్వాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు శ్రీనివాస్, మురళీధర్, తిరుపతయ్య, వెంకన్న తదితరులు పాల్గొన్నారు.


