epaper
Sunday, March 1, 2026
epaper

‘‘అసెంబ్లీలోనే కాంగ్రెస్‌కు గట్టి కౌంటర్’’

‘‘అసెంబ్లీలోనే కాంగ్రెస్‌కు గట్టి కౌంటర్’’
నేటి నుంచి అసెంబ్లీకి కేసీఆర్ హాజరు
నీటి హక్కులపై సభ వేదికగా పోరాటం
పాలమూరు–రంగారెడ్డి అంశమే ప్రధాన ఎజెండా
సమావేశాల తర్వాత భారీ బహిరంగ సభకు నిర్ణయం

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మళ్లీ ప్రజాక్షేత్రంలోకి రావడానికి సిద్ధమయ్యారు. ఎర్రవెల్లి ఫామ్‌హౌస్‌లో జరిగిన పార్టీ సీనియర్ నేతల సమావేశంలో ఆయన భవిష్యత్ కార్యాచరణను ఖరారు చేసినట్లు సమాచారం. ఈ నెల 29 నుంచి ప్రారంభంకానున్న అసెంబ్లీ సమావేశాలకు తప్పకుండా హాజరవుతానని పార్టీ నేతలకు స్పష్టం చేసినట్లు తెలిసింది. నీటి హక్కుల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం అవలంబిస్తున్న వైఖరిని, తెలంగాణకు జరుగుతున్న అన్యాయాన్ని సభ వేదికగా ఎండగట్టడమే లక్ష్యంగా కేసీఆర్ వ్యూహం రచించినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

నీటి హక్కులే ప్రధాన ఆయుధం

తెలంగాణకు రావాల్సిన నదీ జలాల వాటాలో కేంద్రం వివక్ష చూపుతోందని, దీనిపై రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని కేసీఆర్ ఆవేదన వ్యక్తం చేసినట్లు సమాచారం. ఈ అంశాన్ని అసెంబ్లీ వేదికగా బలంగా లేవనెత్తాలని నిర్ణయించారు. కృష్ణా నదిపై ఉన్న ప్రాజెక్టులను బోర్డు పరిధిలోకి తీసుకురావడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ.. ఈ నిర్ణయం వల్ల తెలంగాణ ప్రయోజనాలు దెబ్బతింటాయని ప్రజలకు వివరించాలని ఆయన భావిస్తున్నట్లు తెలుస్తోంది.

పాలమూరు–రంగారెడ్డి చుట్టే పోరాటం

పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పనుల్లో జరుగుతున్న జాప్యం, కేంద్రం నుంచి రావాల్సిన అనుమతులపై ప్రభుత్వం ఒత్తిడి తీసుకురావడంలో విఫలమైందని బీఆర్ఎస్ ఆరోపిస్తోంది. ఈ అంశంపై అటు అసెంబ్లీలో, ఇటు క్షేత్రస్థాయిలో బలమైన పోరాటం చేయాలని కేసీఆర్ స్పష్టం చేసినట్లు సమాచారం. అసెంబ్లీ సమావేశాలు కనీసం 15 రోజులు నిర్వహించాలని అధికారపక్షాన్ని డిమాండ్ చేయాలని పార్టీ నేతలు నిర్ణయించినట్లు తెలుస్తోంది.

సమావేశాల తర్వాత భారీ సభలు

అసెంబ్లీ సమావేశాల అనంతరం మహబూబ్‌నగర్ సమీపంలోని మండల కేంద్రంలో పాలమూరు–రంగారెడ్డి అంశంపై భారీ బహిరంగ సభ నిర్వహించాలని కేసీఆర్ నిర్ణయించినట్లు సమాచారం. అలాగే రాష్ట్రవ్యాప్తంగా సభలు, సమావేశాలు నిర్వహించి ప్రజలను చైతన్యపరచాలని పార్టీ శ్రేణులకు ఆదేశాలు ఇచ్చినట్లు తెలిసింది. కాంగ్రెస్ పార్టీ చరిత్రపూర్వకాలం నుంచీ తెలంగాణకు ద్రోహం చేస్తూనే వచ్చిందని, ప్రస్తుత ప్రభుత్వం కూడా అదే బాటలో నడుస్తోందని కేసీఆర్ విమర్శించినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

ఉద్యోగం ఉన్న‌ట్టా..?లేన‌ట్టా..?

ఉద్యోగం ఉన్న‌ట్టా..?లేన‌ట్టా..? ప‌నిచేస్తున్న‌ట్టా..? చేయ‌డం లేద‌న్న‌ట్టా..?! త్రిశంకు స్వ‌ర్గంలో భూ భార‌తి స‌ర్వేయ‌ర్లు వ‌ర్క ఆర్డ‌ర్...

భూ భారతి కాదు…భూ దోపిడీ!

భూ భారతి కాదు…భూ దోపిడీ! కాంగ్రెస్ నేతలు, అధికారుల జేబులు నింపడానికే కొత్త...

నియో పోలీస్‌కు నీటి భరోసా!

నియో పోలీస్‌కు నీటి భరోసా! జలమండలికి 3.95 ఎకరాల భూమి కేటాయింపు గ్రావిటీ విధానంలో...

కానిస్టేబుల్ సౌమ్య కుటుంబానికి ఎక్సైజ్ విశ్రాంత ఉద్యోగుల ఆసరా

కానిస్టేబుల్ సౌమ్య కుటుంబానికి ఎక్సైజ్ విశ్రాంత ఉద్యోగుల ఆసరా ఒక రోజు పెన్షన్‌తో...

పేదల ఇండ్లు కూల్చడం అమానుషం

పేదల ఇండ్లు కూల్చడం అమానుషం కాంగ్రెస్ పాలనలో క‌క్షపూరిత విధానాలు కొనసాగుతున్నాయి మాజీ మంత్రి...

జీపీలకు రూ.389 కోట్లు.. ఉద్యోగులకు రూ.745 కోట్లు విడుదల

జీపీలకు రూ.389 కోట్లు.. ఉద్యోగులకు రూ.745 కోట్లు విడుదల పెండింగ్ బిల్లుల చెల్లింపుకు...

విద్యా కమిషన్‌లో విద్యావేత్తలే లేరా?

విద్యా కమిషన్‌లో విద్యావేత్తలే లేరా? పీహెచ్‌డీలు లేకుండా విద్యా విధానం ఎలా? అర్హతలేని కమిటీతో...

“విద్యార్థుల నుంచి అధికారుల వరకూ… ఇది మీ త్యాగాల ఫలితం”

“విద్యార్థుల నుంచి అధికారుల వరకూ… ఇది మీ త్యాగాల ఫలితం” ప్రజలు ఆకలిని...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!?

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!? సీజ్ చేసిన క‌ల‌ప‌ మాయం..?! ములుగు జిల్లా అట‌వీశాఖ‌లో క‌ల‌క‌లం వేరే...

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్ 116 మునిసిపాలిటీలు.. 7కార్పోరేష‌న్ల‌లో న‌మోదైన పోలింగ్ శాతం వివ‌రాలు ఒక్క...

ఔష‌ధం కాదు.. ! విషం..!!

ఔష‌ధం కాదు.. ! విషం..!! తెలంగాణలో తయారైన 35ర‌కాల మందులు ఫెయిల్‌ సీడీఎస్‌సీవో తనిఖీల్లో...

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..!

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..! చరిత్రకు జానపద స్వరం..అద్భుతం పాట రూపంలో సమ్మక్క–సారలమ్మ...

మేడారంలో హైటెక్ భద్రత

మేడారంలో హైటెక్ భద్రత మూడు కోట్ల మందికిపైగా భక్తుల రాక అంచనా కమాండ్ కంట్రోల్...

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...
spot_img

Popular Categories

spot_imgspot_img