epaper
Thursday, January 15, 2026
epaper

లెక్క తప్పితే పదవి గల్లంతే!

లెక్క తప్పితే పదవి గల్లంతే!
ఎన్నిక‌ల వ్యయంలో ప్రతి పైసాకు లెక్క చెప్పాల్సిందే
పంచాయతీ కార్యదర్శుల కఠిన ఆదేశాలు
ఆయోమయంలో నూతన సర్పంచులు, వార్డు సభ్యులు

కాకతీయ, కొత్తగూడెం రూరల్ : గ్రామపంచాయతీ ఎన్నికల్లో గెలిచిన ఆనందం ఇంకా చల్లారకముందే నూతన సర్పంచులు, వార్డు సభ్యులకు అసలు పరీక్ష మొదలైంది. ఎన్నికల్లో పెట్టిన ఖర్చులపై ఖచ్చితమైన లెక్కలు సమర్పించాల్సిందేనని పంచాయతీ కార్యదర్శులు గడువు విధించడంతో అభ్యర్థుల్లో ఆందోళన నెలకొంది. లెక్కలు తప్పితే గెలుపు చెల్లదని పంచాయతీరాజ్ చట్టం–2018 స్పష్టం చేస్తోంది. పంచాయతీరాజ్ చట్టం–2018లోని సెక్షన్ 23 ప్రకారం ఎన్నికల ఖర్చుల్లో తేడాలు ఉన్నట్లయితే గెలిచిన అభ్యర్థుల పదవి రద్దుతో పాటు రానున్న మూడు సంవత్సరాల పాటు ఎలాంటి ఎన్నికల్లోనూ పోటీ చేసే అర్హత కోల్పోవాల్సి వస్తుంది. ఈ నిబంధనలు కటువుగా అమలు చేస్తామని అధికారులు స్పష్టం చేయడంతో అభ్యర్థులు ఖర్చుల నివేదికలు సిద్ధం చేసుకునేందుకు పరుగులు పెడుతున్నారు. జిల్లాలోని అనేక గ్రామపంచాయతీల్లో త్రిముఖ పార్టీల పోటీ నడవడంతో గెలుపుకోసం లక్షలాది రూపాయలు ఖర్చు చేసిన పరిస్థితి ఉంది. ఇప్పుడు ఆ ఖర్చులన్నింటికీ సరైన ఆధారాలతో లెక్కలు చూపించాల్సిన పరిస్థితి ఏర్పడింది.

గడువు ముందుగానే.. అభ్యర్థుల్లో కలవరం..!

గత ఎన్నికల్లో 45 రోజుల గడువు ఉండగా, ఈసారి ముందుగానే ఖర్చుల లెక్కలు సమర్పించాలని ఆదేశాలు రావడంతో సర్పంచులు, వార్డు సభ్యులు అయోమయంలో పడుతున్నారు. గుర్తులు కేటాయించిన నాటి నుంచే చేసిన ప్రతి ఖర్చుకూ రసీదులు చూపాల్సి ఉంటుంది. ఇప్పటికే గ్రామ కార్యదర్శులు నోటీసులు జారీ చేసేందుకు సిద్ధమవుతున్నారు. భద్రాద్రి జిల్లాలో మూడు విడతలుగా జరిగిన పంచాయతీ ఎన్నికల్లో మొత్తం వందలాది గ్రామాల్లో పోటీ తీవ్రంగా సాగింది. ఈ నేపథ్యంలో గెలిచిన అభ్యర్థులు ఖర్చుల సర్దుబాటుపై తీవ్ర ఒత్తిడిలో ఉన్నారు.

ఖర్చు పరిమితులు ఇవే..!

పంచాయతీరాజ్ చట్టం ప్రకారం ఐదువేల జనాభా లోపు గ్రామపంచాయతీల్లో సర్పంచ్ గరిష్టంగా రూ.1.50 లక్షలు, వార్డు సభ్యుడు రూ.30 వేల వరకు మాత్రమే ఖర్చు చేయాలి. ఐదువేల పైగా జనాభా ఉన్న పంచాయతీల్లో సర్పంచులకు రూ.2.50 లక్షలు, వార్డు సభ్యులకు రూ.50 వేలే పరిమితి. ఈ పరిమితిని మించి ఖర్చు చేసినట్లు తేలితే చర్యలు తప్పవు. అభ్యర్థులు తమ ఖర్చుల వివరాలను సంబంధిత ఎంపీడీవోలకు సమర్పించి రసీదు పొందాలి. అనంతరం ఫిబ్రవరి 15లోగా టి–పోల్ వెబ్‌సైట్‌లో నమోదు చేయాల్సి ఉంటుంది. ఇందుకోసం ప్రతి మండలానికి కంప్యూటర్ ఆపరేటర్లను నియమించి అధికార యంత్రాంగం సిద్ధమైంది. మొత్తంగా చూస్తే.. గెలుపు తర్వాత అసలైన సవాల్ మొదలైందని రాజకీయ వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. లెక్క తప్పితే పదవి గల్లంతేనన్న హెచ్చరికతో గ్రామ రాజకీయాల్లో ఉత్కంఠ వాతావరణం నెలకొంది.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

ఖండాంతరాల్లో సిపిఐ శతాబ్ది సంబరం..!

ఖండాంతరాల్లో సిపిఐ శతాబ్ది సంబరం..! విదేశాల్లోనూ ఎగసిన వామపక్ష జెండా ఖమ్మం వామపక్ష కుటుంబాల...

రూ.15 లక్షల గంజాయి ద్రవం పట్టివేత.. ఇద్ద‌రి అరెస్టు..

రూ.15 లక్షల గంజాయి ద్రవం పట్టివేత.. ఇద్ద‌రి అరెస్టు.. ద్విచక్ర వాహనం, రెండు...

రిజర్వేషన్లకు ముందే టికెట్ల యుద్ధం

రిజర్వేషన్లకు ముందే టికెట్ల యుద్ధం * మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో పొలిటికల్ హీట్ *...

చైనా మాంజాలపై ఉక్కుపాదం

చైనా మాంజాలపై ఉక్కుపాదం * విక్రయిస్తే కేసులు తప్పవు * వాహనదారులకు ప్రాణహాని * పక్షుల...

ప్రజావాణి కి అధికారుల డుమ్మా

ప్రజావాణి కి అధికారుల డుమ్మా * 11 దాటినా జాడలేని అధికారులు * 29...

భూసారం కాపాడుకోవడం రైతు బాధ్యత

భూసారం కాపాడుకోవడం రైతు బాధ్యత సాగు ఖర్చులు త‌గ్గితేనే ఆదాయం పెరుగుతుంది అవసరానికి మించి...

స్థానిక సమస్యలకు సీపీఐ(ఎం)తోనే పరిష్కారం

స్థానిక సమస్యలకు సీపీఐ(ఎం)తోనే పరిష్కారం సంస్కృతి–సంప్రదాయాలకు ప్రతీక రంగవల్లికలు సీపీఐ(ఎం) ఖమ్మం డివిజన్ కార్యదర్శి...

నేడు కాంగ్రెస్‌ ముత్యాల ముగ్గుల పోటీలు

నేడు కాంగ్రెస్‌ ముత్యాల ముగ్గుల పోటీలు కొత్తగూడెం ప్రకాశం స్టేడియంలో 3 గంటలకు...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...

రేవంత్ కు కొత్త సవాల్!

* సర్కార్ కు పరీక్షగా సీఎస్ ఎంపిక? * ఈ నెలాఖరున రామకృష్ణారావు...

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం కాక‌తీయ‌, హైదరాబాద్ : రంగారెడ్డి జిల్లాలోని బాటసింగారంలో...

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన ప్రతిపాదించిన ప్రాజెక్టుపై...

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా న్యూ డిల్లీ జూలై...

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు మొన్న యూనివర్సిటీల్లో ఆందోళనలు నిషేధిస్తూ మెమో నేడు...

రాష్ట్రంలో హద్దులు దాటిపోతున్న ఫోన్‌ ట్యాపింగ్‌

రాష్ట్రంలో హద్దులు దాటిపోతున్న ఫోన్‌ ట్యాపింగ్‌ కాంగ్రెస్‌ దూత ఫోన్‌ ట్యాపింగ్‌..! గాంధీ...
spot_img

Popular Categories

spot_imgspot_img