స్మార్ట్ కిడ్జ్‌లో ఘనంగా సెమీ క్రిస్మస్ వేడుకలు
కాకతీయ, ఖమ్మం : స్థానిక స్మార్ట్ కిడ్జ్ పాఠశాలలో బుధవారం సెమీ క్రిస్మస్ వేడుకలు ఆనందోత్సాహాలతో నిర్వహించారు. పాఠశాల ఆవరణలో పశువుల పాకను ప్రతిబింబించే విధంగా ఏర్పాట్లు చేసి, ఏసుప్రభు జనన ఘట్టాలను చిన్నారులు ఆకట్టుకునేలా ప్రదర్శించారు. ఏసుప్రభు, మేరీమాత, దేవదూతల వేషధారణలో విద్యార్థులు కనువిందు చేశారు. ఈ సందర్భంగా పాఠశాల కరస్పాండెంట్ చింతనిప్పు కృష్ణ చైతన్య కేక్ కట్ చేసి విద్యార్థులకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. యేసు ప్రభు బోధించిన ప్రేమ, కరుణ, శాంతి విలువలు ప్రతి ఒక్కరూ అనుసరించాలని పేర్కొన్నారు. అన్ని మతాల పర్వదినాలను పాఠశాలలో నిర్వహించడం ద్వారా విద్యార్థులకు సాంప్రదాయాలపై అవగాహన కల్పిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల డైరెక్టర్ చింతనిప్పు సుకన్య, ప్రిన్సిపల్, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు


