గ్రామీణ పేదల పొట్టగొట్టే విధానాలను తిప్పికొట్టాలి
కాకతీయ, కొత్తగూడెం రూరల్ : ఉపాధి హామీ పథకాన్ని రద్దు చేసే కేంద్ర ప్రభుత్వ విధానాలను తిప్పికొట్టాలని వామపక్షాల నాయకులు పిలుపునిచ్చారు. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని రద్దు చేస్తూ తీసుకొచ్చిన విబిజి రాంజీ బిల్లును ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ మంగళవారం వామపక్షాల ఆధ్వర్యంలో జీవో కాపీలను దగ్ధం చేసి నిరసన తెలిపారు. ఈ పథకం గ్రామీణ పేదలకు పని హక్కును కల్పించిందని, వలసలను అడ్డుకుందని నేతలు పేర్కొన్నారు. గాంధీ పేరును తొలగించే కుట్రలో భాగంగానే పథకాన్ని రద్దు చేస్తున్నారని ఆరోపించారు. ఉపాధి హామీని కాపాడుకునేందుకు భవిష్యత్లో ఉద్యమాలు కొనసాగిస్తామని ప్రకటించారు.


