కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో పొంచి ఉంది. ఏపీ, తెలంగాణ వాతావరణ శాఖ ఇప్పటికే ఆయా జిల్లాలకు అలర్ట్ జారీ చేసింది. రెండు రాష్ట్రాల్లో మరో మూడు రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. అల్పపీడన ప్రాంతం, రుతుపవన ద్రోణి, ఉపరితల చక్రవాత ఆవర్తనం ప్రభావంతో తెలంగణలో భారీ వర్షాలు కురుస్తాయని రేపటి నుంచి అంటే ఆగస్టు 18వ తేదీ నుంచి భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.
ఆదిలాబాద్, జయశంకర్ భూపాలపల్లి, కామారెడ్డి, కొమురంభీం, మహబూబాబాద్, మంచిర్యాల, మెదక్, ములుగు, నిర్మల్, నిజామాబాద్, పెద్దపల్లి, వరంగల్ జిల్లాల్లో అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశం ఉంది. భద్రాద్రి కొత్తగూడెం, హన్మకొండ, జగిత్యాల, జనగాం, కరీంనగర్, రాజన్న సిరిసిల్ల, సంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది.
బంగాళాఖాతంలో ఈ నెల 18 నుంచి 23 తేదీల్లో అల్పపీడనాలు ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. వీటి ప్రభావంతో రాగల మూడు రోజుల్లో ఏపీ, తెలంగాణలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. కోస్తాంధ్రలో కొన్నిచోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురవనున్నాయి. సోమవారం తెలంగాణలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. 18 నుంచి 19 తేదీల్లో అత్యంత అతి భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించింది..


