డిసెంబర్ 24న జాబ్ మేళా
భారత్ హ్యుందాయ్‌లో ఉద్యోగాలకు అవకాశం
ఖమ్మం–మధిర పట్టణాల్లో పోస్టులు
కాకతీయ, ఖమ్మం : జిల్లాలోని నిరుద్యోగ యువతీ, యువకులకు ప్రైవేట్ రంగంలో ఉపాధి కల్పించేందుకు డిసెంబర్ 24న (బుధవారం) జాబ్ మేళా నిర్వహించనున్నట్లు జిల్లా ఉపాధి అధికారి కొండపల్లి శ్రీరామ్ తెలిపారు. ఖమ్మం హవేలీ రెస్టారెంట్ ఎదురుగా ఉన్న టీటీడీసీ భవనంలో ఉదయం 10 గంటల నుంచి ఈ జాబ్ మేళా జరగనుందని ఆయన వెల్లడించారు. ఈ జాబ్ మేళా ద్వారా భారత్ హ్యుందాయ్ కంపెనీలో వివిధ విభాగాల్లో ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు తెలిపారు. జిల్లా యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఖమ్మం, మధిర ప్రాంతాల్లో పనిచేసే విధంగా ఫీల్డ్ సేల్స్ కన్సల్టెంట్స్, సర్వీస్ అడ్వైజర్లు, షోరూం సేల్స్ కన్సల్టెంట్స్, అకౌంట్ ఎగ్జిక్యూటివ్స్, రిసెప్షనిస్ట్, సీఆర్ఈ, సేల్స్ టీం లీడర్స్, సేల్స్ మేనేజర్ పోస్టులకు నియామకాలు చేపట్టనున్నట్లు జిల్లా ఉపాధి అధికారి తెలిపారు.
అర్హతలు, వేతన వివరాలు
ఏదైనా డిగ్రీ అర్హత కలిగి, 24 నుంచి 35 ఏళ్ల వయస్సు గల యువతీ, యువకులు అర్హులని పేర్కొన్నారు. ఎంపికైన అభ్యర్థులకు రూ.12,000 నుంచి రూ.25,000 వరకు వేతనంతో పాటు ఇన్సెంటివ్స్ కూడా అందిస్తారని తెలిపారు. జాబ్ మేళాకు హాజరయ్యే అభ్యర్థులు తమ విద్యార్హతల సర్టిఫికెట్ల జిరాక్స్ కాపీలతో రావాలని సూచించారు. మరిన్ని వివరాల కోసం 70369 02902 నంబర్‌లో సంప్రదించాలని జిల్లా ఉపాధి అధికారి కోరారు.


