యూరియా సరఫరాకు లంచం డిమాండ్
ఏసీబీకి అడ్డంగా బుక్కైన వనపర్తి జిల్లా వ్యవసాయశాఖ అధికారి
కాకతీయ, వనపర్తి : ఫిర్యాదుదారునికి ఎటువంటి అంతరాయం లేకుండా యూరియా ఎరువు సరఫరా చేస్తానని హామీ ఇచ్చి రూ.20 వేల లంచం డిమాండ్ చేసిన వనపర్తి జిల్లా వ్యవసాయ అధికారి పుప్పాల ఆంజనేయులు గౌడ్‌ను తెలంగాణ అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు పట్టుకున్నారు. లంచం మొత్తంలో ముందుగా రూ.3,000 తీసుకున్న అధికారి, మిగిలిన మొత్తంలో నుంచి రూ.10,000 తీసుకుంటున్న సమయంలో ఏసీబీ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నట్లు తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.


