ఖమ్మం ఆర్టీఏ ఆఫీసులో ఏసీబీ దాడులు
15 మంది ఏజెంట్లను అదుపులోకీ తీసుకున్న ఏసీబీ
దాడుల్లో 70 వేల నగదు స్వాధీనం
కాకతీయ, ఖమ్మం ప్రతినిధి : ఖమ్మం రవాణా శాఖ కార్యాలయంలో అవినీతి నిరోధక శాఖ అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. తనిఖీల్లో భాగంగా రవాణా శాఖ కార్యా లయం ఆవరణలో 15 మంది పలువురు ప్రైవేటు వ్యక్తులను ఏసిబి అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఏజెంట్ల దగ్గర నుంచి సుమారు 70,000 నగదును, పలు డాక్యుమెంట్స్ తో పాటు ఆర్సి, డ్రైవింగ్ లైసెన్స్ కార్డును ఏసిబి అధికా రులు స్వాధీనం చేసుకున్నారు. రవాణా శాఖ కార్యాలయంలోని లాప్ టాప్, మొబైల్స్, పలు డాక్యుమెంట్లను స్వాధీ నం చేసుకున్నారు.ఆ శాఖ అధికారులను ఏసీబీ అధికారులు విచారిస్తున్నారు. ప్రభుత్వ అధికారులు వాళ్ళు చేయాల్సిన పనికి లంచం డిమాండ్ చేస్తే ఏసీబీకు ఫిర్యాదు చేయాలని ఏసిబి డిఎస్పి రమేష్ సూచించారు. ప్రజల్లో అవేర్నెస్ కోసం డిసెంబర్ 3 నుంచి 9 వరకు అవినీ తి నిరోధక శాఖ ఆధ్వర్యంలో వారోత్సవా లు నిర్వహించామని తెలిపారు. ప్రభుత్వ అధికారులు ఎవరైనా డబ్బులు డిమాండ్ చేస్తే 24 గంటల టోల్ ఫ్రీ నెంబర్ 1064 ఫిర్యాదు చేయాలని డి.ఎస్.పి విజ్ఞప్తి చేశారు.


