రెండు పంచాయతీల్లో రీకౌంటింగ్ జరగాలి
ఆధార్ పార్టీ భద్రాద్రి జిల్లా అధ్యక్షుడు కంటే కేశవ్ గౌడ్
కాకతీయ, చర్ల : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలం చిన్నమెడిసిలేరు, అశ్వరావుపేట మండలం ఆసుపాక గ్రామపంచాయతీల్లో మరోసారి ఓట్ల రీకౌంటింగ్ నిర్వహించాలని ఆధార్ పార్టీ జిల్లా అధ్యక్షుడు కంటే కేశవ్ గౌడ్ డిమాండ్ చేశారు. శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. ఈ రెండు గ్రామపంచాయతీల్లో ఓట్ల లెక్కింపు సమయంలో కొందరు అధికారులు లైట్లు నిలిపివేసి లెక్కింపు చేశారని, ఇది ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమన్నారు. అధికార పార్టీ నాయకుల అండతో దొంగచాటుగా లెక్కింపు చేసి గెలుపు దిశగా ప్రయత్నాలు జరిగాయని ఆరోపించారు. ఈ నేపథ్యంలో వెంటనే పారదర్శకంగా మళ్లీ రీకౌంటింగ్ చేపట్టాలని కోరారు. సమావేశంలో కొత్తగూడెం ఇన్చార్జి, ఇల్లందు నియోజకవర్గ ఇన్చార్జి అలెం వెంకటేశ్వరరావు, ప్రేమ్ దయాల్, పినపాక నియోజకవర్గ ఇన్చార్జి నరేష్, అశ్వరావుపేట నియోజకవర్గ ఇన్చార్జి ముత్తయ్య దొరతో పాటు ఆధార్ పార్టీ నాయకులు, గ్రామస్తులు పాల్గొన్నారు.


