epaper
Thursday, January 15, 2026
epaper

సాగునీటి విడుద‌ల‌పై స్ప‌ష్ట‌త ఇవ్వాలి

సాగునీటి విడుద‌ల‌పై స్ప‌ష్ట‌త ఇవ్వాలి
గణపురం ఆనకట్ట ఆధారంగా వేల ఎక‌రాల సాగు
ప్ర‌భుత్వం ఏ విష‌యం చెప్ప‌కుండా సాగ‌దీత‌
సాధ్యం కాకుంటే క్రాప్ హాలిడే ప్ర‌క‌టించి పరిహారం చెల్లించాలి
మెదక్ జిల్లా రైతాంగం యాసంగిపై అయోమయం
మాజీ మంత్రి హరీష్ రావు డిమాండ్

కాక‌తీయ‌, మెదక్ : సింగూరు ప్రాజెక్టు నుంచి గణపురం ఆనకట్టకు సాగునీరు విడుదల చేస్తారా లేదా అన్న అంశంపై రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పష్టత ఇవ్వాలని మాజీ మంత్రి, బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు హరీష్ రావు డిమాండ్ చేశారు. యాసంగి సాగు చేయాలా వద్దా అన్న తీవ్ర సందిగ్ధంలో మెదక్ జిల్లా రైతాంగం కొట్టుమిట్టాడుతోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. మెదక్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. గణపురం ఆన‌కట్టపై ఆధార‌ప‌డి వేల ఎకరాల భూమి సాగ‌వుతోంద‌న్నారు. పాపన్నపేట, హవేలీఘన్పూర్, కొల్చారం, మెదక్ రూరల్ మండలాల్లోని వేలాది ఎకరాల వ్యవసాయం పూర్తిగా గణపురం ఆనకట్టపై ఆధారపడి ఉందన్నారు. సింగూరు ప్రాజెక్టు నుంచి నీటి విడుదలపై స్పష్టత లేకపోవడం రైతుల్లో ఆందోళన పెంచుతోందన్నారు.

వేసవిలో చేయాల్సిన పనులు ఇప్పుడు ఎందుకు?

సింగూరు ప్రాజెక్టు మరమ్మతులు వేసవిలో చేయాల్సి ఉండగా, ఇప్పుడు చేపట్టడం ప్రభుత్వ అసమర్థతకు నిదర్శనమన్నారు. ప్రస్తుతం ప్రాజెక్టులో 17 టీఎంసీల నీరు ఉన్నప్పటికీ పంటను కాపాడుతూ మరమ్మతులు చేయవచ్చని, కానీ ప్రభుత్వానికి ఆ చిత్తశుద్ధి లేదని విమర్శించారు. నాట్ల సమయం దగ్గర పడుతున్నా అధికారులు స్పందించకపోవడంతో రైతులు గత్యంతరం లేక మళ్లీ బోర్లు వేస్తూ అప్పుల పాలవుతున్నారని తెలిపారు. కేసీఆర్ పాలనలో బోరు బండి మాయమైతే, రేవంత్ రెడ్డి పాలనలో మళ్లీ పాత రోజులు వచ్చాయని ఎద్దేవా చేశారు.

నీటి విడుదల లేకపోతే క్రాప్ హాలిడే
సింగూరు నీటిపై మెదక్, నిజామాబాద్ రైతుల హక్కులను ప్రభుత్వం కాపాడాలని డిమాండ్ చేశారు. తక్షణమే గణపురం ఆనకట్టకు నీటి విడుదలపై స్పష్టమైన ప్రకటన చేయాలని, లేనిపక్షంలో క్రాప్ హాలిడే ప్రకటించి ఎకరాకు తగిన నష్టపరిహారం చెల్లించాలని సూచించారు. గత పది సంవత్సరాల్లో బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో రెండు పంటలకు నీళ్లు అందించి రైతులు హైదరాబాద్‌కు వలస వెళ్లకుండా చూసిన ఘనత ఉందన్నారు. అవసరమైతే కాళేశ్వరం నీళ్లను మళ్లించి కూడా పంటలను కాపాడినట్టు గుర్తు చేశారు.

రూ.1800 కోట్ల బోనస్ బకాయిలు

రుణమాఫీ, రైతుబంధు, బోనస్ విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను మోసం చేసిందన్నారు. ఏడుపాయల సాక్షిగా రుణమాఫీ చేస్తానన్న సీఎం ఇప్పటివరకు కేవలం 40 శాతం మందికే పూర్తి చేశారని విమర్శించారు. గత యాసంగి, ఈ వానాకాలం కలిపి రైతులకు రావాల్సిన సుమారు రూ.1800 కోట్ల బోనస్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. వ్యవసాయానికి యాప్‌లు, మ్యాప్‌లు కాదని… నీళ్లు, కరెంటు, ఎరువులు కావాలని హరీష్ రావు స్పష్టం చేశారు. స్మార్ట్‌ఫోన్ లేని రైతులు, మహిళా రైతులు యాప్‌లు ఎలా వాడతారని ప్రశ్నించారు. ఇది రైతులను వేధించేందుకే చేస్తున్న నాటకమని ఆరోపించారు. కొత్త చట్టాల పేరుతో కౌలు రైతులు, యజమానుల మధ్య పంచాయతీలు పెడుతున్నారని ఆరోపించారు. యాప్ విధానాన్ని వెంటనే రద్దు చేసి, గతంలో మాదిరిగా ఫెర్టిలైజర్ షాపుల ద్వారా యూరియా సరఫరా చేయాలని డిమాండ్ చేశారు. తక్షణమే రుణమాఫీ పూర్తి చేయాలని, బోనస్ బకాయిలు చెల్లించాలని, రైతుబంధు విడుదల చేయాలని, గణపురం ఆనకట్ట నీటిపై స్పష్టమైన ఉత్తర్వులు జారీ చేయాలని బీఆర్ఎస్ పార్టీ పక్షాన హరీష్ రావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

కాంగ్రెస్ పాలనలో పోరాటాల క్రాంతి..!

కాంగ్రెస్ పాలనలో పోరాటాల క్రాంతి..! సంక్రాంతి వేళ రైతులకు నిరాశే మిగిలింది బ్యాంక్ ఖాతాల...

సంగారెడ్డిలో ఘోర రోడ్డు ప్రమాదం

సంగారెడ్డిలో ఘోర రోడ్డు ప్రమాదం అదుపుతప్పి కల్వర్టు గుంతలో పడిన బైక్ ఒకే...

సిగాచీ ప‌రిశ్ర‌మ సీఈవో అరెస్ట్

సిగాచీ ప‌రిశ్ర‌మ సీఈవో అరెస్ట్ కాకతీయ, సంగారెడ్డి బ్యూరో : సంగారెడ్డి జిల్లా...

సర్పంచ్ గెలుపుతో రెచ్చిపోయిన కాంగ్రెస్ నేత

సర్పంచ్ గెలుపుతో రెచ్చిపోయిన కాంగ్రెస్ నేత బీఆర్ఎస్ అభ్యర్థిపై ట్రాక్టర్‌తో దాడి.. ఎల్లారెడ్డిలో...

Sircilla: సిరిసిల్ల కలెక్టర్‌పై వేటు..సంబురాలు చేసుకున్న నాయకులు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: నిత్యం వివాదాలతో వార్తల్లో నిలిచిన సిరిసిల్ల కలెక్టర్...

Maoist: మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు కడారి సత్యనారాయణ రెడ్డికి కన్నీటి వీడ్కోలు.!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు కడారి సత్యనారాయణరెడ్డి...

ఇలా తయారయ్యారేంట్రా.. బర్రె దూడపై అత్యాచారం..!!

కాకతీయ, మెదక్: కామాంధుల వికృత చేష్టలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. మనుషులే కాదు,...

Chicken: భార్య చికెన్ వండలేదని సూసైడ్ చేసుకున్న భర్త..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: ఆంధ్రప్రదేశ్‌లోని ప్రకాశం జిల్లా, యర్రగొండపాలెం మండలం, గోళ్లవిడిసిలో...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...

రేవంత్ కు కొత్త సవాల్!

* సర్కార్ కు పరీక్షగా సీఎస్ ఎంపిక? * ఈ నెలాఖరున రామకృష్ణారావు...

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం కాక‌తీయ‌, హైదరాబాద్ : రంగారెడ్డి జిల్లాలోని బాటసింగారంలో...

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన ప్రతిపాదించిన ప్రాజెక్టుపై...

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా న్యూ డిల్లీ జూలై...

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు మొన్న యూనివర్సిటీల్లో ఆందోళనలు నిషేధిస్తూ మెమో నేడు...

రాష్ట్రంలో హద్దులు దాటిపోతున్న ఫోన్‌ ట్యాపింగ్‌

రాష్ట్రంలో హద్దులు దాటిపోతున్న ఫోన్‌ ట్యాపింగ్‌ కాంగ్రెస్‌ దూత ఫోన్‌ ట్యాపింగ్‌..! గాంధీ...
spot_img

Popular Categories

spot_imgspot_img