epaper
Monday, March 2, 2026
epaper

ప్ర‌జా అస‌రాల‌కు అనుగుణంగా నగరాభివృద్ధి

ప్ర‌జా అస‌రాల‌కు అనుగుణంగా నగరాభివృద్ధి
ప‌నుల నాణ్య‌త విష‌యంలో రాజీలేదు
డివిజన్‌కు కోటి రూపాయల కేటాయింపు
మంత్రి తుమ్మ‌ల నాగేశ్వ‌ర్‌రావు
ఖ‌మ్మం 14వ డివిజన్‌లో రూ.2.25 కోట్ల పనులకు శంకుస్థాపన

కాకతీయ, ఖమ్మం ప్రతినిధి : ప్రజల అవసరాలకు అనుగుణంగా ఖమ్మం నగర పరిధిలో అభివృద్ధి పనులు చేపడుతున్నామని రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్, సహకార, చేనేత జౌళి శాఖల మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. ఖమ్మం నగరంలోని 14వ డివిజన్ గోపాలపురంలో రూ.2 కోట్ల 25 లక్షల అంచనా వ్యయంతో చేపట్టనున్న బీటీ, సీసీ రోడ్లు, డ్రెయిన్‌ల అభివృద్ధి పనులకు గురువారం మంత్రి శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ అభిషేక్ అగస్త్య పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. నగర ప్రజలకు అవసరమైన మౌలిక వసతుల కల్పనకు ముఖ్యమంత్రి సంపూర్ణ సహకారం అందిస్తున్నారని చెప్పారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు భూకబ్జాదారులు, రౌడీలకు ఖమ్మం నగరంలో చోటు ఉండదని స్పష్టం చేశారు. అక్రమ కేసులు, భూకబ్జాలు, మట్కా, గంజాయి వంటి దందాలకు ప్రస్తుత పాలనలో తావులేదన్నారు. గంజాయి వల్ల యువత, చిన్నారులు భవిష్యత్తు నాశనమవుతోందని ఆందోళన వ్యక్తం చేసిన మంత్రి.. ఈ దుష్ప్రవర్తనను అరికట్టేందుకు ప్రజలంతా భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.

నగరాభివృద్ధికి భారీ నిధులు

ఖమ్మం నగర అభివృద్ధికి ఇప్పటికే ప్రభుత్వం రూ.50 కోట్ల నిధులు మంజూరు చేసిందని, జనవరిలో మరో రూ.50 కోట్లు మంజూరు చేసేలా కృషి చేస్తున్నామని మంత్రి తెలిపారు. చేపట్టే ప్రతి పని నాణ్యతతో, వేగంగా పూర్తయ్యేలా అధికారులు, ప్రజాప్రతినిధులు ప్రత్యేకంగా పర్యవేక్షించాలని ఆదేశించారు. గోపాలపురంలో ప్రారంభించిన అభివృద్ధి పనులను మూడు నెలల్లో పూర్తి చేయాలని స్పష్టం చేసిన మంత్రి.. నాణ్యత ప్రమాణాలు పాటించకపోతే భవిష్యత్‌లో నిధులు మంజూరు కాదని హెచ్చరించారు. పది కాలాల పాటు ప్రజలకు ఉపయోగపడేలా పనులు ఉండాలన్నారు. ఖమ్మం నగర జనాభా ఐదు లక్షలకు చేరిందని, పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా తాగునీరు, డ్రెయిన్‌లు, రహదారులు, పేదలకు ఇళ్ల వంటి మౌలిక వసతులపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందన్నారు. రాజకీయాలకతీతంగా ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా నాయకులు పనిచేయాలని సూచించారు.

డివిజన్‌కు కోటి రూపాయల కేటాయింపు

ఖమ్మం మున్సిపల్ కమిషనర్ అభిషేక్ అగస్త్య మాట్లాడుతూ.. 14వ డివిజన్‌లో రూ.2.25 కోట్లతో సీసీ డ్రెయిన్‌లు (ఒక కిలోమీటర్), రోడ్లు (రెండు కిలోమీటర్లు) నిర్మిస్తున్నట్లు తెలిపారు. ఇటీవల మంజూరైన రూ.50 కోట్ల గ్రాంట్‌లో 14వ డివిజన్‌కు రూ.కోటి కేటాయించామని, సంబంధిత పనులు త్వరలో ప్రారంభమవుతాయని చెప్పారు. నగరవ్యాప్తంగా ఫుట్‌పాత్‌లు, పార్కులు, కేబుల్ బ్రిడ్జి, ఖమ్మం ఖిల్లాకు రోప్‌వే, సింథటిక్ ట్రాక్, ప్రధాన రహదారుల విస్తరణ వంటి పనులు జరుగుతున్నాయని తెలిపారు. నగరాన్ని పరిశుభ్రంగా, పచ్చదనంతో తీర్చిదిద్దేందుకు చర్యలు చేపట్టినట్లు వెల్లడించారు. కార్యక్రమంలో వ్యవసాయ మార్కెట్ చైర్మన్ హనుమంతరావు, కార్పొరేటర్లు, ఆర్డీఓ నరసింహారావు, ఇరిగేషన్ ఈఈ అనన్య, అర్బన్ తహసీల్దార్ సైదులు తదితరులు పాల్గొన్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

ఎస్సీ వర్గీకరణ పోరులో అమరవీరులకు జోహార్లు

ఎస్సీ వర్గీకరణ పోరులో అమరవీరులకు జోహార్లు సింగరేణిలో ఎమ్మార్పీఎస్ గద్దె వద్ద నివాళులు త్యాగాలు...

బొగ్గు–ఇసుక లారీల బీభత్సం..!

బొగ్గు–ఇసుక లారీల బీభత్సం..! మణుగూరు–బయ్యారం రహదారి ధ్వంసం దుమ్ము ధూళితో గిరిజన బిడ్డల అనారోగ్యం ప్రజల...

అదుపుతప్పిన ఇసుక ట్రాక్టర్ – డ్రైవర్ దుర్మరణం

అదుపుతప్పిన ఇసుక ట్రాక్టర్ – డ్రైవర్ దుర్మరణం నాగులవంచ వద్ద తెల్లవారుజామున ప్రమాదం ఓవర్‌టేక్...

వెలుగుమట్ల బాధితులపై ముమ్మర సర్వే

వెలుగుమట్ల బాధితులపై ముమ్మర సర్వే 21 మంది తహశీల్దార్లతో యుద్ధప్రాతిపదికన సర్వే ఖమ్మం జిల్లాకు...

వెలుగుమట్ల బాధితులకు బీఆర్ఎస్ అండ

వెలుగుమట్ల బాధితులకు బీఆర్ఎస్ అండ ఎంపీ వద్దిరాజు రవిచంద్ర ఆధ్వర్యంలో భోజనాల పంపిణీ కాకతీయ,...

సీఎం రేవంత్ రెడ్డికి సన్మానసభ పోస్టర్ ఆవిష్కరణ

సీఎం రేవంత్ రెడ్డికి సన్మానసభ పోస్టర్ ఆవిష్కరణ కాకతీయ, ఖమ్మం : ఎస్సీ...

భూదాన్ వ్యవహారంలో విపక్షాలే అభాసు

భూదాన్ వ్యవహారంలో విపక్షాలే అభాసు పేదల పేరుతో రాద్ధాంతం చేశారు ఏజెంట్ల మోసాలపై బాధితులకు...

మోదీ పాలనలో దేశానికి ప్రమాదం

మోదీ పాలనలో దేశానికి ప్రమాదం కార్పొరేట్ల కోసమే కేంద్రం విధానాలు సీపీఐ (ఎం) పొలిట్...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!?

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!? సీజ్ చేసిన క‌ల‌ప‌ మాయం..?! ములుగు జిల్లా అట‌వీశాఖ‌లో క‌ల‌క‌లం వేరే...

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్ 116 మునిసిపాలిటీలు.. 7కార్పోరేష‌న్ల‌లో న‌మోదైన పోలింగ్ శాతం వివ‌రాలు ఒక్క...

ఔష‌ధం కాదు.. ! విషం..!!

ఔష‌ధం కాదు.. ! విషం..!! తెలంగాణలో తయారైన 35ర‌కాల మందులు ఫెయిల్‌ సీడీఎస్‌సీవో తనిఖీల్లో...

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..!

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..! చరిత్రకు జానపద స్వరం..అద్భుతం పాట రూపంలో సమ్మక్క–సారలమ్మ...

మేడారంలో హైటెక్ భద్రత

మేడారంలో హైటెక్ భద్రత మూడు కోట్ల మందికిపైగా భక్తుల రాక అంచనా కమాండ్ కంట్రోల్...

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...
spot_img

Popular Categories

spot_imgspot_img