- ఏకగ్రీవంగా ఎన్నిక
కొత్తగూడెం, కాకతీయ: కొత్తగూడెంకు చెందిన ప్రముఖ ఈఎన్‌టీ వైద్యుడు డా. బి.ఎస్.రావును ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఏ) కొత్తగూడెం శాఖ జనరల్ సెక్రటరీగా సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఇందుకు సంబంధించిన ప్రకటనను డా. బి.ఎస్.రావు బుధవారం విడుదల చేశారు. ఈ సందర్భంగా డా. బి.ఎస్.రావు మాట్లాడుతూ, తనపై నమ్మకంతో ఐఎంఏ జనరల్ సెక్రటరీగా ఎన్నుకున్న సభ్యులందరికీ కృతజ్ఞతలు తెలిపారు. ఈ బాధ్యతను సమర్థంగా నిర్వహిస్తూ ఐఎంఏ అభివృద్ధికి కృషి చేస్తానని పేర్కొన్నారు. ప్రజలకు నాణ్యమైన వైద్యం మరింత చేరువయ్యేలా కృషి చేస్తానని తెలిపారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రజలకు, ముఖ్యంగా నిరుపేదలకు ప్రైవేటు వైద్యం కూడా తక్కువ ఖర్చుతో నాణ్యంగా అందేలా నిజాయితీగా ప్రయత్నిస్తానని డా. బి.ఎస్.రావు స్పష్టం చేశారు. ఇదిలా ఉండగా, డా. బి.ఎస్.రావు ఐఎంఏ కొత్తగూడెం జనరల్ సెక్రటరీగా ఏకగ్రీవంగా ఎన్నిక కావడంపై కొత్తగూడెం పట్టణానికి చెందిన పలువురు ప్రముఖులు, వ్యాపారవేత్తలు, వివిధ రాజకీయ పార్టీల నాయకులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు అభినందనలు తెలిపారు.


