epaper
Thursday, January 15, 2026
epaper

గెలుపు ప్రలోబాలకు ఎర…

గెలుపు ప్రలోబాలకు ఎర…
మ‌రి కొద్దిగంట‌ల్లో మూడో విడత పోలింగ్‌

కాకతీయ/జూలూరుపాడు : మూడో విడత గ్రామ పంచాయతీ ఎన్నికలకు కౌంట్‌డౌన్‌ ప్రారంభమైంది. మరికొన్ని గంటల్లో పోలింగ్‌ ప్రారంభం కానుంది. ఇప్పటికే పల్లెల్లో ప్రచార హడావుడి ముగిసింది. 48 గంటల ముందే మైకులు మూగబోగా.. అభ్యర్థులు క్షేత్రస్థాయిలో వ్యూహాలు అమలు చేస్తున్నారు. ఫలితాలు వెలువడే వరకు మద్యం దుకాణాల మూసివేతకు అధికారులు ఆదేశాలు జారీ చేశారు. అయితే కొన్ని ప్రాంతాల్లో రాత్రి వేళల్లో మందు పార్టీల సందడి కొనసాగుతోందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.

పగలు మంతనాలు.. రాత్రి దావత్‌లు

పోలింగ్‌ సమయం దగ్గరపడటంతో అభ్యర్థులు పగటిపూట ముమ్మర మంతనాలు చేస్తూనే.. రాత్రివేళల్లో రహస్య సమావేశాలకు తెరలేపుతున్నారు. కుల సంఘాల నాయకులు, మాజీ సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, పార్టీ నేతలతో భేటీలు కొనసాగిస్తున్నారు. తమకే ఓటు వేయాలంటూ అభ్యర్థిస్తూ.. గెలిస్తే చేపట్టే అభివృద్ధి పనులపై హామీలు గుప్పిస్తున్నారు. కొంతమంది అభ్యర్థులు సొంత నిధులతోనే అభివృద్ధి చేస్తామని చెప్పుకొస్తున్నారు. ఎన్నికల సంఘం నిబంధనల మేరకు బహిరంగ సమావేశాలకు నిషేధం ఉండటంతో రాత్రి వేళల్లో రహస్యంగా భేటీలు నిర్వహిస్తున్నట్లు సమాచారం. కొన్ని చోట్ల సాయంత్రం అయ్యిందంటే చాలు.. ఓటర్లకు దావత్‌లు, మద్యం పార్టీలు ఏర్పాటు చేస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి.

మద్యం దుకాణాలు బంద్‌

మండల పరిధిలో సోమవారం సాయంత్రం నుంచి ఈ నెల 17వ తేదీ సాయంత్రం వరకు మద్యం దుకాణాలు, బెల్ట్‌ షాపులు, ఇతర మద్యం విక్రయ కేంద్రాలను మూసివేయాలని అధికారులు ఆదేశించారు. ఈ రెండు రోజుల పాటు సాధారణ మద్యం దుకాణాలతో పాటు ప్రత్యేక లైసెన్సులపై విక్రయాలు చేసే వారు కూడా మద్యం అమ్మకాలు, సర్వ్‌ చేయడం నిషేధమని స్పష్టం చేశారు.

ఓటర్ల ప్రలోభాలకు ప్లాన్‌

ప్రచారం ముగియడంతో ఓటర్లను ప్రలోభ పెట్టే ప్రయత్నాలు ఊపందుకున్నట్లు తెలుస్తోంది. ఎన్నికల ముందురోజు రాత్రి, పోలింగ్‌ రోజు తెల్లవారుజామున మద్యం, నగదు పంపిణీకి ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం. ఇందుకోసం రహస్య ప్రాంతాల్లో డబ్బు, మద్యం నిల్వలు ఉంచినట్లు తెలుస్తోంది. ఏరియా ప్రాధాన్యతను బట్టి ఒక్కో ఓటుకు రూ.500 నుంచి రూ.1,000 వరకు పంపిణీ చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేసినట్లు ప్రచారం జరుగుతోంది. ఇందుకు సంబంధించి ఓటర్ల జాబితాలు సిద్ధం చేసి గుట్టుచప్పుడు కాకుండా చేరవేసేందుకు వ్యూహాలు రచిస్తున్నట్లు సమాచారం.

అభ్యర్థులు, అనుచరుల వ్యూహాలు

గ్రామ పంచాయతీ ఎన్నికల్లో సత్తా చాటేందుకు కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ తదితర పార్టీలు వ్యూహ–ప్రతివ్యూహాలతో ముందుకెళ్తున్నాయి. అభ్యర్థుల ఎంపికలో ఆచితూచి అడుగులు వేసిన పార్టీలు.. పలు చోట్ల ఏకగ్రీవ స్థానాలను కూడా కైవసం చేసుకున్నాయి. గెలుపే లక్ష్యంగా ప్రచారం కొనసాగిస్తూనే అసంతృప్త ఓటర్లను దారికి తెచ్చే ప్రయత్నాలు చేస్తున్నాయి. బలమైన అనుచరులతో కలిసి క్షేత్రస్థాయిలో పని చేయాలని సూచిస్తూ మెజారిటీ స్థానాలు దక్కించుకునేందుకు పావులు కదుపుతున్నాయి.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

ఖండాంతరాల్లో సిపిఐ శతాబ్ది సంబరం..!

ఖండాంతరాల్లో సిపిఐ శతాబ్ది సంబరం..! విదేశాల్లోనూ ఎగసిన వామపక్ష జెండా ఖమ్మం వామపక్ష కుటుంబాల...

రూ.15 లక్షల గంజాయి ద్రవం పట్టివేత.. ఇద్ద‌రి అరెస్టు..

రూ.15 లక్షల గంజాయి ద్రవం పట్టివేత.. ఇద్ద‌రి అరెస్టు.. ద్విచక్ర వాహనం, రెండు...

రిజర్వేషన్లకు ముందే టికెట్ల యుద్ధం

రిజర్వేషన్లకు ముందే టికెట్ల యుద్ధం * మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో పొలిటికల్ హీట్ *...

చైనా మాంజాలపై ఉక్కుపాదం

చైనా మాంజాలపై ఉక్కుపాదం * విక్రయిస్తే కేసులు తప్పవు * వాహనదారులకు ప్రాణహాని * పక్షుల...

ప్రజావాణి కి అధికారుల డుమ్మా

ప్రజావాణి కి అధికారుల డుమ్మా * 11 దాటినా జాడలేని అధికారులు * 29...

భూసారం కాపాడుకోవడం రైతు బాధ్యత

భూసారం కాపాడుకోవడం రైతు బాధ్యత సాగు ఖర్చులు త‌గ్గితేనే ఆదాయం పెరుగుతుంది అవసరానికి మించి...

స్థానిక సమస్యలకు సీపీఐ(ఎం)తోనే పరిష్కారం

స్థానిక సమస్యలకు సీపీఐ(ఎం)తోనే పరిష్కారం సంస్కృతి–సంప్రదాయాలకు ప్రతీక రంగవల్లికలు సీపీఐ(ఎం) ఖమ్మం డివిజన్ కార్యదర్శి...

నేడు కాంగ్రెస్‌ ముత్యాల ముగ్గుల పోటీలు

నేడు కాంగ్రెస్‌ ముత్యాల ముగ్గుల పోటీలు కొత్తగూడెం ప్రకాశం స్టేడియంలో 3 గంటలకు...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...

రేవంత్ కు కొత్త సవాల్!

* సర్కార్ కు పరీక్షగా సీఎస్ ఎంపిక? * ఈ నెలాఖరున రామకృష్ణారావు...

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం కాక‌తీయ‌, హైదరాబాద్ : రంగారెడ్డి జిల్లాలోని బాటసింగారంలో...

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన ప్రతిపాదించిన ప్రాజెక్టుపై...

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా న్యూ డిల్లీ జూలై...

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు మొన్న యూనివర్సిటీల్లో ఆందోళనలు నిషేధిస్తూ మెమో నేడు...

రాష్ట్రంలో హద్దులు దాటిపోతున్న ఫోన్‌ ట్యాపింగ్‌

రాష్ట్రంలో హద్దులు దాటిపోతున్న ఫోన్‌ ట్యాపింగ్‌ కాంగ్రెస్‌ దూత ఫోన్‌ ట్యాపింగ్‌..! గాంధీ...
spot_img

Popular Categories

spot_imgspot_img