సర్పంచ్ గెలుపుతో రెచ్చిపోయిన కాంగ్రెస్ నేత
బీఆర్ఎస్ అభ్యర్థిపై ట్రాక్టర్‌తో దాడి.. ఎల్లారెడ్డిలో కలకలం (వీడియో)
బ్రేకింగ్ న్యూస్
సర్పంచ్ ఎన్నికల్లో గెలిచి రెచ్చిపోతున్న కాంగ్రెస్ నాయకులు
తనకు వ్యతిరేకంగా పోటీ చేసిన బీఆర్ఎస్ సర్పంచ్ అభ్యర్థిని ట్రాక్టర్ తో ఢీకొట్టిన కాంగ్రెస్ అభ్యర్థి
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నది నన్ను ఎవరు ఏం చేయలేరు అని చెప్పి మరి దాడి చేశాడు
ఎల్లారెడ్డి… pic.twitter.com/cDoknYIJOH
— Telugu Scribe (@TeluguScribe) December 15, 2025
కాకతీయ, ఎల్లారెడ్డి : సర్పంచ్ ఎన్నికల్లో గెలిచిన ఆనందంలో కాంగ్రెస్ నాయకులు హద్దులు దాటుతున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఎల్లారెడ్డి నియోజకవర్గంలోని సోమార్పేట్ గ్రామంలో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి, మండల అధ్యక్షుడు సాయిబాబా బాబాయి తనకు వ్యతిరేకంగా పోటీ చేసిన బీఆర్ఎస్ అభ్యర్థిపై ట్రాక్టర్‌తో దాడి చేసిన ఘటన తీవ్ర కలకలం రేపింది. గ్రామంలో బీఆర్ఎస్ అభ్యర్థి బిట్ల బాలరాజుపై గెలుపొందిన అనంతరం, ఫలితాల వేడుకల సమయంలో బాలరాజు తన ఇంటి ముందు కూర్చుని ఉండగా, అతని కుటుంబ సభ్యులు, అనుచరులపై కాంగ్రెస్ అభ్యర్థి ట్రాక్టర్‌తో ఢీకొట్టినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ ఘటనలో బాలరాజుతో పాటు పలువురు తీవ్ర గాయాలపాలయ్యారు. స్థానికుల కథనం ప్రకారం, దాడికి ముందు కాంగ్రెస్ అభ్యర్థి “ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంది.. నన్ను ఎవ్వరూ ఏం చేయలేరు” అంటూ బెదిరింపులకు పాల్పడినట్లు తెలుస్తోంది. అనంతరం ట్రాక్టర్‌తో నేరుగా దూసుకెళ్లి దాడి చేయడంతో గ్రామంలో భయాందోళనలు నెలకొన్నాయి. తీవ్రంగా గాయపడిన బీఆర్ఎస్ అభ్యర్థి బిట్ల బాలరాజు, ఆయన అనుచరులను స్థానికులు హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. వారి పరిస్థితిపై వైద్యులు పర్యవేక్షణ కొనసాగిస్తున్నట్లు సమాచారం. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు తెలుస్తోంది. ఎన్నికల అనంతరం జరుగుతున్న ఈ తరహా హింసాత్మక ఘటనలు ప్రజాస్వామ్యానికి ముప్పుగా మారుతున్నాయన్న ఆందోళన స్థానికంగా వ్యక్తమవుతోంది.



