భద్రాచలంలో ‘సెల్ఫీ సూసైడ్’ కలకలం
నిద్ర మాత్రలు మింగి మహిళా నాయకురాలి ఆత్మహత్యాయత్నం
భద్రాచలంలో సెల్ఫీ సూసైడ్ కలకలం..
ఒక పంచాయతీ విషయంలో దళిత సంఘాల నేతలు తనను వేధిస్తున్నారని నిద్ర మాత్రలు మింగి మహిళా నాయకురాలు మేకల లత ఆత్మహత్యాయత్నం
తను చనిపోయేందుకు కారణమైన వారిని ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టొద్దు అంటూ సోషల్ మీడియాలో వీడియో పోస్ట్
ప్రస్తుతం స్థానిక ప్రభుత్వ… pic.twitter.com/zWbp4JAUyn
— BIG TV Breaking News (@bigtvtelugu) December 15, 2025
కాకతీయ, భద్రాచలం : భద్రాచలంలో ‘సెల్ఫీ సూసైడ్’ ఘటన కలకలం రేపింది. ఒక పంచాయతీ అంశంలో దళిత సంఘాల నేతలు తనను వేధిస్తున్నారని ఆరోపిస్తూ మహిళా నాయకురాలు మేకల లత నిద్ర మాత్రలు మింగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన స్థానికంగా సంచలనం సృష్టించింది. ఆత్మహత్యాయత్నానికి ముందు మేకల లత సోషల్ మీడియాలో ఓ వీడియోను పోస్ట్ చేశారు. తన మృతికి కారణమైన వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టవద్దంటూ ఆ వీడియోలో ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఈ వీడియో వైరల్‌గా మారడంతో విషయం వెలుగులోకి వచ్చింది. అప్రమత్తమైన కుటుంబ సభ్యులు, స్థానికులు ఆమెను వెంటనే భద్రాచలం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె అక్కడ చికిత్స పొందుతున్నట్లు వైద్యులు తెలిపారు. ఆమె పరిస్థితి నిలకడగా ఉన్నట్లు సమాచారం. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. వీడియోలో చేసిన ఆరోపణలు, పంచాయతీ వివాదానికి సంబంధించిన అంశాలపై విచారణ చేపట్టినట్లు పోలీసులు వెల్లడించారు. ఈ ఘటన భద్రాచలంలో రాజకీయ, సామాజిక వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీసింది.


