నేడు ఐఎల్పీఏ రాష్ట్ర సదస్సు
కాకతీయ, కొత్తగూడెం : ఇండియన్ లీగల్ ప్రొఫెషనల్స్ అసోసియేషన్ (ఐఎల్పీఏ) ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఐదో రాష్ట్ర మహాసభ ఆదివారం కొత్తగూడెం క్లబ్‌లో జరగనుంది. ఈ సదస్సును న్యాయవాదులందరూ విజయవంతం చేయాలని ఐఎల్పీఏ జిల్లా కన్వీనర్ జే.గోపికృష్ణ శనివారం ఒక ప్రకటనలో కోరారు. న్యాయవాదుల హక్కులు, సమస్యలు, భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ‘బ్లాక్ కోట్స్ ఫర్ బ్లూ రెవల్యూషన్’ నినాదంతో ఈ సదస్సు నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. వృత్తిపరమైన, సామాజిక, ఆర్థిక సమస్యలపై పోరాటంతో పాటు, అట్టడుగు వర్గాల న్యాయవాదులను విద్య ద్వారా విముక్తి చేయాలనే లక్ష్యంతో ఐఎల్పీఏ నిరంతరం కృషి చేస్తోందని పేర్కొన్నారు. జూనియర్ సివిల్ జడ్జి (జేసీజే), అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ (ఏపీపీ) తదితర పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న న్యాయవాదులకు ఏడాది పొడవునా ఉచిత ఆన్‌లైన్ కోచింగ్ అందిస్తున్న ఏకైక సంస్థ తమదేనని వివరించారు. మహాత్మా జ్యోతిబా ఫూలే, బాబాసాహెబ్ డాక్టర్ బీఆర్ అంబేద్కర్ భావజాలంతో, సమానత్వం, సామాజిక చైతన్యాన్ని లక్ష్యంగా పెట్టుకుని నిర్వహిస్తున్న ఈ రాష్ట్ర మహాసభకు న్యాయవాదులందరూ హాజరై విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో ఐఎల్పీఏ సభ్యులు భానుప్రియ, యెర్రా కామేష్, సాధిక్ పాషా, అంబటి రమేష్, మారపాక రమేష్, వడ్లకుండ హరి తదితరులు పాల్గొన్నారు.


