ఎస్పీఎస్ ఉద్యోగులకు కనీస వేతనాలివ్వాలి
ఉద్యోగ భద్రత కల్పించడంతో పాటు సంక్షేమానికి చర్యలు తీసుకోవాలి
డిమాండ్లను నెరవేర్చకుంటే ఆందోళనలకు దిగుతాం
ఎంప్లాయిస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు సైదయ్య
కాకతీయ, ఖమ్మం ప్రతినిధి : శానిటేషన్, పేషెంట్ కేర్, సెక్యూరిటీ గార్డ్స్ కు కనీసం వేతనంగా రూ.25వేలు ఇవ్వాలని ఎంప్లాయిస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు సైదయ్య డిమాండ్ చేశారు. ఖమ్మం గవర్నమెంట్ జనరల్ హాస్పటల్‌లో పనిచేస్తున్న శానిటేషన్, పేషెంట్ కేర్, సెక్యూరిటీ గార్డ్స్ కు రావాల్సిన పెండింగ్ వేతనాలను వెంటనే చెల్లించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కాంటాక్ట్ వ్యవస్థను రద్దుచేసి ప్రభుత్వం ద్వారానే కార్మికులకు అందరికీ వేతనం వచ్చే రీతిగా చేయాలని డిమాండ్ చేశారు. ఖమ్మం ఆస్పత్రి ప్రాంగణంలో శనివారం సైదయ్య మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఆస్పటల్ నందు పనిచేస్తున్న శానిటేషన్ పేషంట్ కేర్ సెక్యూరిటీ గార్డ్స్ కి ప్రతి ఒక్క కార్మికుడికి కనీస వేతనం 26000/ ఇవ్వాలన్నారు. ప్రతి ఒక్క కార్మికునికి హెల్త్ కార్డు ప్రభుత్వం ఇచ్చి కార్మికుల కుటుంబాల్ని ఆదుకోవాలని కోరారు . ప్రభుత్వ ఆస్పటల్ నందు పనిచేస్తున్న ప్రతి మహిళ అక్కచెల్లెళ్ల కార్మికులకు నెలసరి వేతనంతో కూడిన సెలవు దినముగా ఇవ్వాలని స్పష్టం చేశారు . ప్రతి కార్మికుడికి డబల్ పిఎఫ్ ద్వారా వేతనంలో కట్ చేస్తున్నారని తెలిపారు. అది తక్షణమే జీవో నెంబర్ 60 ని సవరణ చేసి ఒక పిఎఫ్ కాంట్రాక్టర్ ఒక పిఎఫ్ ప్రభుత్వం చెల్లించలన్నారు . ప్రభుత్వ ఆస్పత్రుల్లో శానిటేషన్ , పేషెంట్ కేర్ , సెక్యూరిటీ గార్డ్స్ 16 , 870 కార్మికులు పనిచేస్తున్నారని అన్నారు. తమ డిమాండ్లను ప్రభుత్వం నెరవేర్చకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రభుత్వ ఆస్పత్రుల్లో నిరసనలకు దిగుతామని తెలిపారు. అవసరమైతే సేవలను కూడా నిలిపేస్తామని అన్నారు. కార్యక్రమంలో ఎస్పీఎస్ ఎంప్లాయిస్ అసోసియేషన్ రాష్ట్ర నాయకుడు మాతంగి అనిల్ కుమార్, ఖమ్మం జిల్లా టీయూసీఐ నాయకులు శ్యాము , బోనాల ఉపేందర్ , ఎస్పీఎస్ లీడర్స్ వంగూరి నరేష్ , అనగానే ఉదయ్ కుమార్ , చిన్న వెంకన్న , వినోద్ , మహేష్ , జీవన , వెంకటమ్మ , రేష్మ , శేషమ్మ , సైదమ్మ , నాగేంద్ర , రమ్య , జ్యోతి , రజిని , రమాదేవి , సి ఎహెచ్ మహేష్ , ఆర్ కే , వెంకటేశ్వరరావు , నాగమణి, రాందాసు తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు .


