epaper
Monday, March 2, 2026
epaper

రెవెన్యూ అధికారి చేతివాటం

రెవెన్యూ అధికారి చేతివాటం
ఇంటి నెంబర్ల కేటాయింపున‌కు ల‌క్ష‌ల్లో వసూళ్లు
ఒకటే ఇంటి నెంబర్ పై రెండు మద్యం దుకాణాల నిర్మాణాలు
ఖమ్మం కార్పొరేషన్‌లో అధికారి లీల‌లు
సీఎంవో కార్యాలయ పైర‌వీ అంటూ కింది స్థాయి సిబ్బందిపై ఒత్తిడి
ఎన్ని సార్లు చర్యలు తీసుకున్న మారని ఆయ‌న‌ తీరు

కాకతీయ, ఖమ్మం ప్రతినిధి : ఖమ్మం కార్పొరేషన్ లో రెవెన్యూ అధికారి చేతివాటం చూపిస్తూ అందని కాడికి దండుకుంటున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ మధ్యకాలంలో ఖమ్మం నగరపాలక సంస్థ పరిధిలో కేటాయించిన మద్యం దుకాణాల ఇంటి నెంబర్ల కోసం ఈ చర్యలకు పాల్పడ్డట్లు ఆరోప‌ణ‌లు వ‌స్తున్నాయి. ఖ‌మ్మం ప‌ట్ట‌ణంలోని శ్రీ శ్రీ సర్కిల్ లో నిర్మాణం జరుగుతున్న లిక్కర్ మార్ట్ ఇంటి నెంబర్ మద్యం దుకాణం ఇంటి నెంబర్ ఒక్కటేన‌ని తెలుస్తోంది. ఈ విషయంపై రెవెన్యూ అధికారి అంతా నేను చూసుకుంటా ఆ యజమానికి హామీ ఇచ్చినట్లు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అదేవిధంగా బల్లేపల్లి లో కొత్తగా నిర్మాణం అవుతున్న మద్యం దుకాణం విస్తీర్ణం సుమారు 3000 గజాల్లో నిర్మాణం జ‌రుగుతున్న‌ట్లు తెలుస్తోంది.

సీఎంవో కార్యాలయ పైర‌వీ అంటూ అధికారి లీల‌లు..

ఆ మద్యం దుకాణ యజమాని కి ఇచ్చిన మాట ప్రకారం ఇంటి నెంబర్ కేటాయింపు జరపడం కోసం కిందిస్థాయి సిబ్బంది పై ఈ ఫైలు సి ఎం ఓ కార్యాలయం రికమండేషన్ మీద వచ్చిందంటూ వారిపై ఒత్తిడి పెంచి కేటాయింపు జరిపినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. మరో లిక్కర్ మార్ట్ టూ టౌన్ పోలీస్ స్టేషన్ ఎదురుగా ఏర్పాటు చేసుకునేందుకు ఆ యజమాని కి ఇంటి నెంబర్ కోసం మాట ఇచ్చినట్లు వార్తలు వినపడుతున్నాయి. ఈ యజమాని దీని కన్నా ముందు జమ్మి బండ పక్కన ఏర్పాటు చేసుకోవడానికి అభ్యంతరాలు రావడంతో దానిని షిఫ్టింగ్ పేరుతో ఇల్లందు క్రాస్ రోడ్ కి మార్చుకున్నట్లు తెలుస్తోంది. ఇక్కడ కూడా వివాదంలో ఉన్న భవనం కావడం ఆ భవనానికి ఇంటి నెంబరు ఇస్తాను అనడం ఆ రెవెన్యూ అధికారి పని తీరుకు నిదర్శనమని చెప్పవచ్చు. ఈ మూడు మద్యం దుకాణాలకు గాను ఇప్పటికే సుమారు లక్షన్నరపైగా వసూలు చేసినట్లు ఆరోపణలు వినబడుతున్నాయి. కొన్నేళ్లుగా ఖమ్మం కార్పొరేషన్లో పనిచేసిన ఈ అధికారి వివిధ ఆరోపణల నేపథ్యంలో కార్యాలయానికి దూరమైనప్పటికీ మరల ఉద్యోగ సంఘాల అండదండలతో ఖమ్మం కార్పొరేషన్ లో కి వచ్చి అదే తీరును కొనసాగించడం గమనార్హం.

 

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

ఎస్సీ వర్గీకరణ పోరులో అమరవీరులకు జోహార్లు

ఎస్సీ వర్గీకరణ పోరులో అమరవీరులకు జోహార్లు సింగరేణిలో ఎమ్మార్పీఎస్ గద్దె వద్ద నివాళులు త్యాగాలు...

బొగ్గు–ఇసుక లారీల బీభత్సం..!

బొగ్గు–ఇసుక లారీల బీభత్సం..! మణుగూరు–బయ్యారం రహదారి ధ్వంసం దుమ్ము ధూళితో గిరిజన బిడ్డల అనారోగ్యం ప్రజల...

అదుపుతప్పిన ఇసుక ట్రాక్టర్ – డ్రైవర్ దుర్మరణం

అదుపుతప్పిన ఇసుక ట్రాక్టర్ – డ్రైవర్ దుర్మరణం నాగులవంచ వద్ద తెల్లవారుజామున ప్రమాదం ఓవర్‌టేక్...

వెలుగుమట్ల బాధితులపై ముమ్మర సర్వే

వెలుగుమట్ల బాధితులపై ముమ్మర సర్వే 21 మంది తహశీల్దార్లతో యుద్ధప్రాతిపదికన సర్వే ఖమ్మం జిల్లాకు...

వెలుగుమట్ల బాధితులకు బీఆర్ఎస్ అండ

వెలుగుమట్ల బాధితులకు బీఆర్ఎస్ అండ ఎంపీ వద్దిరాజు రవిచంద్ర ఆధ్వర్యంలో భోజనాల పంపిణీ కాకతీయ,...

సీఎం రేవంత్ రెడ్డికి సన్మానసభ పోస్టర్ ఆవిష్కరణ

సీఎం రేవంత్ రెడ్డికి సన్మానసభ పోస్టర్ ఆవిష్కరణ కాకతీయ, ఖమ్మం : ఎస్సీ...

భూదాన్ వ్యవహారంలో విపక్షాలే అభాసు

భూదాన్ వ్యవహారంలో విపక్షాలే అభాసు పేదల పేరుతో రాద్ధాంతం చేశారు ఏజెంట్ల మోసాలపై బాధితులకు...

మోదీ పాలనలో దేశానికి ప్రమాదం

మోదీ పాలనలో దేశానికి ప్రమాదం కార్పొరేట్ల కోసమే కేంద్రం విధానాలు సీపీఐ (ఎం) పొలిట్...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!?

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!? సీజ్ చేసిన క‌ల‌ప‌ మాయం..?! ములుగు జిల్లా అట‌వీశాఖ‌లో క‌ల‌క‌లం వేరే...

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్ 116 మునిసిపాలిటీలు.. 7కార్పోరేష‌న్ల‌లో న‌మోదైన పోలింగ్ శాతం వివ‌రాలు ఒక్క...

ఔష‌ధం కాదు.. ! విషం..!!

ఔష‌ధం కాదు.. ! విషం..!! తెలంగాణలో తయారైన 35ర‌కాల మందులు ఫెయిల్‌ సీడీఎస్‌సీవో తనిఖీల్లో...

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..!

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..! చరిత్రకు జానపద స్వరం..అద్భుతం పాట రూపంలో సమ్మక్క–సారలమ్మ...

మేడారంలో హైటెక్ భద్రత

మేడారంలో హైటెక్ భద్రత మూడు కోట్ల మందికిపైగా భక్తుల రాక అంచనా కమాండ్ కంట్రోల్...

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...
spot_img

Popular Categories

spot_imgspot_img