శ్రీ రాగా స్కూల్‌లో విద్యార్థి సంఘాల ఎన్నికలు
కాకతీయ, కొత్తగూడెం : కొత్తగూడెం కార్పొరేషన్ పరిధిలోని మెదరబస్తిలో ఉన్న శ్రీ రాగా స్కూల్‌లో బుధవారం విద్యార్థి సంఘాల ఎన్నికలు జరిగాయి. ‘ఓటుకు నోటు’ లేకుండా బ్యాలెట్ పేపర్లు, బ్యాలెట్ బాక్స్‌ను విద్యార్థులే తయారు చేయడం ప్రత్యేకతగా నిలిచింది. నలుగురు అభ్యర్థులు 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ప్రచారం నిర్వహించి విద్యార్థుల కోసం చేయబోయే సేవలను వివరించారు. కరస్పాండెంట్ మల్లారపు వరప్రసాద్ మాట్లాడుతూ ప్రసాద్ మాట్లాడుతూ ప్రజాస్వామ్య విలువలు ఓటు హక్కు ప్రాధాన్యతపై అవగాహన కల్పించడమే ఈ ఎన్నికల లక్ష్యం అని పేర్కొన్నారు. పిల్లల్లో సమాజంపై అవగాహన కలిగించేందుకు ఈ తరహా ఆక్టివిటీస్‌ను స్కూల్లో అమలు చేస్తున్నట్లుగా నిర్వాహాకులు తెలిపారు. కార్యక్రమంలో డైరెక్టర్ కవిత, ఉపాధ్యాయులు సర్వేశ్వరరావు, రాంబాబు, భువనశోభ, శ్రావణి, అనుష, అన్నపూర్ణ, మోహిత, సుష్మా, సుమ తదితరులు పాల్గొన్నారు.


