ప్రత్యేక నిఘాను ఏర్పాటు చేసుకోవాలి
భద్రాద్రి జిల్లా ఎస్పీ రోహిత్ రాజు
కాకతీయ, కొత్తగూడెం : సమస్యాత్మక వ్యక్తుల కదలికలపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసుకోవాలని భద్రాద్రి జిల్లా ఎస్పీ రోహిత్ రాజు సూచించారు.
బుధవారం ఎస్పీ కార్యాలయంలో కొత్తగూడెం సబ్ డివిజన్ పోలీస్ అధికారులతో జిల్లా ఎస్పీ రోహిత్ రాజు సమావేశమయ్యారు. పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో సమస్య ఆత్మక వ్యక్తులను గుర్తించి వారిపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా సబ్ డివిజన్లోని పోలీస్ స్టేషన్ల పరిధిలోని పంచాయతీల వారీగా ప్రస్తుత పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల వద్ద పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేయాలని సూచించారు. ప్రజలు నిర్భయంగా తమ ఓటు హక్కును వినియోగించుకునే విధంగా ప్రతి పోలింగ్ కేంద్రం వద్ద బందోబస్తు విధులను నిర్వర్తించే అధికారులు సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. ఎన్నికల నియమాలని కచ్చితంగా పాటించాలని సూచించారు. ఏవైనా సమస్యలు తలెత్తితే వెంటనే తమ దృష్టికి తీసుకురావాలని తెలిపారు. ఓటర్లను ప్రోలోపు పెట్టే విధంగా ప్రవర్తించే వ్యక్తులపై ఎన్నికల నియమావళి ప్రకారం కేసులు నమోదు చేయాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో కొత్తగూడెం డిఎస్పి రెహమాన్, 2టౌన్ సీఐ ప్రతాప్, జూలూరుపాడు సీఐ శ్రీలక్ష్మి, చుంచుపల్లి సీఐ వెంకటేశ్వర్లు, ఎస్సైలు రమణా రెడ్డి, రవి, రమాదేవి, జయసింహారెడ్డి, శివరామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.


