దివ్యాంగుల సంక్షేమానికి కృషి
సంక్షేమ అధికారిణి స్వర్ణలత లెనినా
కాకతీయ, కొత్తగూడెం : అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవ వేడుకలు ఐ.డి.ఓ.సి మీటింగ్ హాల్ నందు జిల్లా సంక్షేమ అధికారిణి స్వర్ణలత లెనినా అధ్యక్షతన సోమవారం నిర్వహించారు. ముఖ్యఅతిథిగా పాల్గొన్న అడిషనల్ కలెక్టర్ విద్యా చందన మాట్లాడుతూ జిల్లాలోని అర్హులైన దివ్యాంగులు యుడిఐడి కార్డులు పొందాలని తెలియచేశారు. గతంలో పొందిన యు.డి.ఐ.డి. కార్డుల సవరణలు పోర్టల్ ద్వారా చేసుకోవచ్చని జిల్లాలో దివ్యాంగుల డ్వాక్రా సంఘాలుగా తయారయి పొదుపు చేసి రుణాలు పొందవచ్చని తెలిపారు. జిల్లా సంక్షేమ అధికారిణి మాట్లాడుతూ దివ్యాంగులకు వివాహ ప్రోత్సాహక బహుమతి, దివ్యాంగులను సకలాంగులు లేదా దివ్యాంగులను దివ్యాంగులు వివాహం చేసుకున్న వారికి లక్ష రూపాయలు ప్రోత్సాహక బహుమతికి అర్హులైన వారు టీజీ ఈపాస్ వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేయాలని సూచించారు. కార్యక్రమంలో జడ్.పి. సి.ఇ.ఓ. నాగలక్ష్మి, మెప్మ పీడీ రాజేష్, సెర్ప్ సిబ్బంది, ఐ.ఈ.డి. కోఆర్డినేటర్ సైదులు, బ్లైండ్ అసోసియేషన్ అధ్యక్షుడు నరేందర్, బదిరుల సంఘం జిల్లా అధ్యక్షుడు రామలింగారెడ్డి, తెలంగాణ విభిన్న ప్రతిభావంతుల సంఘం అధ్యక్షులు సతీష్, మదర్ తెరిసా దివ్యాంగుల సంఘం అధ్యక్షుడు కృష్ణ, విహెచ్పిఎస్ సంఘం అధ్యక్షుడు సుధాకర్, అక్షయ దివ్యాంగుల సంఘం అధ్యక్షురాలు షమీం, ఎన్ పి ఆర్ డి సంఘం అధ్యక్షుడు ప్రవీణ్ కుమార్, ఎంప్లాయిస్ అసోసియేషన్ అధ్యక్షుడు జగ్గుదాస్, బి.లక్ష్మణ్, ఎం.డి ముజాహిద్, జిల్లా సంక్షేమ శాఖ కార్యాలయ సిబ్బంది దివ్యాంగులు పాల్గొన్నారు.


