కాకతీయ, తెలంగాణ బ్యూరో: శ్రీశైలానికి 12కిలోమీటర్ల దూరంలో ఉన్న చిన్నారుట్ల చెంచుగూడెంలో చిరుతపులి దాడి చేసిన ఘటన కలకలం రేపుతోంది. ప్రకాశం జిల్లా దోర్నాల మండలం చిన్నారుట్ల చెంచుగూడెంలో బుధవారం అర్థరాత్రి నిద్రిస్తున్న కుడుముల అంజయ్య, లింగేశ్వర దంపతుల కూతురిపై చిరుతపులి దాడి చేసింది. సమీప అడవిలో నుంచి వచ్చిన చిరుత తల్లి పక్కన నిద్రిస్తున్న చిన్నారిని ఈడ్చుకెళ్లింది. అక్కడే ఉన్న తండ్రి కేకలు వేయడంతో చిరుతను వెంబడించారు. గ్రామ శివారులో చిన్నారిని వదిలేసింది. చిరుత దాడిలో గాయపడిన చిన్నారిని సున్నిపెంట ప్రభుత్వాసుపత్రికి తరలించారు.


