విద్యానగర్ సర్పంచ్‌గా భూక్యశాంతి
కాకతీయ, చుంచుపల్లి : కొత్తగూడెం జిల్లా చుంచుపల్లి మండలం విద్యానగర్ గ్రామ పంచాయతీ సర్పంచ్‌గా భూక్య శాంతి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.విద్యానగర్ ఎస్టీ మహిళ రిజర్వు కావడంతో భూక్యశాంతి, దారావత్ దేవి లలిత నామినేషన్ వేశారు. అయితే శనివారం దారావత్ దేవి లలిత విత్ డ్రా చేసుకోవడంతో భూక్యశాంతి సర్పంచ్‌గా ఏకగ్రీవ ఎన్నిక ఖాయమైంది. గ్రామ పంచాయతీ రికార్డు ల ప్రకారం విద్యానగర్ గ్రామంచాయతీ జనాభా సుమారు 10300 కాగా, ఓటర్ల సంఖ్య 7019, వార్డు లు 12 ఉన్నాయి.


