జింకల వేట కేసులో నలుగురు నిందితులు జైలుకు పంపాం
జంతువుల వేట చట్టవ్యతిరేకమైన చర్య
విలేకరుల సమావేశంలో జిల్లా అటవీ శాఖ అధికారి సిద్ధార్థ విక్రమ్ సింగ్
కాకతీయ, ఖమ్మం ప్రతినిధి: కొంతమంది వ్యక్తులు సత్తుపల్లి నీలాద్రి అర్బన్ పార్క్ లో నాటు తుపాకులతో 5 జింకలను వేటాడి చంపిన ఘటనలో నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్ చేసినట్లు జిల్లా అటవీ శాఖ అధికారి సిద్ధార్ద్ విక్రమ్ సింగ్ మీడియా సమావేశంలో తెలిపారు.
ఉమ్మడి ఖమ్మం జిల్లా సత్తుపల్లి అటవీ శాఖ రేంజ్ పరిధిలో గత నెల 24 న అశ్వరావు పేట మాజీ. ప్రజాప్రతినిధి సోదరుడి కుమారుడు మెచ్చా రఘు , అతని స్నేహితులు కొందరు అదే ప్రాంతంలో అటవీ శాఖలో ఔట్ సోర్స్ ఉద్యోగిగా పనిచేస్తున్న గోపి కృష్ణ అనే వ్యక్తి మద్దతు తీసుకొని ఈ ఘాతుకానికి పాల్పడినట్లు తెలిపారు.అదే రోజు సాయంత్రం 6 గంటల తరువాత అటవీ ప్రాంతంలో ఉన్న సీసీ కెమెరాలను మార్చి,ఏమార్చి గోపి కృష్ణ అనే ఔట్ సోర్స్ ఉద్యోగి సహాయంతో నాటు తుపాకులతో ఓ వాహనంలో నలుగురు వ్యక్తులు వెళ్లి 5 జింకలను వేటాడి చంపి తీసుకెళ్లినట్లు గుర్తించామని అన్నారు.నిందితులు గోపికృష్ణ, శ్రీరామ్ ప్రసాద్ ,భరత్,రఘు అనే వ్యక్తులు ఒక ప్రొఫెషనల్ షూటర్ ను తీసుకుని వచ్చి జింకలు వేటాడినట్లు తెలిసిందన్నారు.ఘటన అనంతరం నిందితులు వివిధ ప్రాంతాలకు పారిపోయి తలదాచుకున్నారని తెలిపారు. ఖమ్మం సీపీ ,భద్రాద్రి కొత్తగూడెం ఎస్పీ ల సహకారంతో నిన్న నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్ చేసి జైలు కు పంపించామని తెలిపారు.ఈ కేసు చేదనలో పాల్గొని నిందితులను గుర్తించిన అటవీ శాఖ సిబ్బందికి అభినందనలు తెలిపారు.అదేవిధంగా వేట చట్ట రీత్యా నేరమని నిజాం, నవాబు కాలం నాటి రోజులు కాదని, ఇప్పుడు రోజులు మారాయి దయచేసి ఎవరు కూడా వేట వంటివి చేయకండని అటవీశాఖ అధికారి ప్రజలకు హితవుపలికారు.అటవీ ప్రాంతంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశాం, ఎవరైనా వేట కదలికలు చేస్తే వారిని అరెస్ట్ చేసి, వన్యప్రాణి చట్టం ప్రకారం జైలు కి పంపిస్తాం అని హెచ్చరించారు.


