బెల్ట్ షాపులపై టాస్క్ ఫోర్స్ దాడులు
నాలుగు రోజుల్లో 4 లక్షల విలువ చేసే మద్యం సీజ్
టాస్క్ ఫోర్స్ ఏసీపీ సత్యనారాయణ
కాకతీయ, ఖమ్మం ప్రతినిధి : గ్రామపంచాయతీ ఎన్నికలను పురస్కరించుకొని పలు గ్రామాలలో టాస్క్ ఫోర్స్ బృందాలు బెల్ట్ షాపులపై దాడులు నిర్వహించినట్లు టాస్క్ ఫోర్స్ ఏసీపీ సత్యనారాయణ తెలిపారు.
పోలీస్ కమిషనర్ సునీల్ దత్ ఆదేశాల మేరకు కొణిజర్ల, రఘునాదపాలెం, చింతకాని, వి ఎం. బంజారా, ముదిగొండ, ఖమ్మం రూరల్,సత్తుపల్లి, తిరుమలాయపాలెం, వెంసూర్ లోని వివిధ ప్రదేశాలలో బెల్టు దుకాణాలపై ప్రత్యేక దాడి నిర్వహించి నాలుగు లక్షల విలువ గల ఐ ఎమ్ ఎఫ్ ఎల్ మద్యం సుమారు 600 లీటర్లను స్వాధీనం చేసుకుని తదుపరి చర్యల నిమిత్తం సంబంధిత పోలీస్ స్టేషన్లకు అప్పగించి నట్లు తెలిపారు.ఏన్కూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఎస్సై సంధ్య ఆధ్వర్యంలో బెల్ట్ షాపులపై దాడులు నిర్వహించి 42 వేల విలువ చేసే 240 లీటర్ల మద్యం బాటిల్స్ స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.


