పబ్లిక్ మంచినీటి ట్యాంక్ ను కూల్చివేత
అర్ధరాత్రి కూల్చివేత పనులు దారుణం
ప్రజల దాహం తీర్చే నీటి ట్యాంకును ఎలా కూల్చివేశారు..?
ఎవరికి అడ్డముంది.. ఎవరికోసం కూల్చారు?
ఆగ్రహం వ్యక్తం చేస్తున్న అయ్యప్ప మాలధారులు
కాకతీయ, కొత్తగూడెం : కూల్చివేతకు అర్ధరాత్రి ముహూర్తం పెట్టి దారుణంగా మంచినీటి ట్యాంకుతో పాటు గుడి ప్రహరి గోడను దారుణంగా కూల్చివేశారు. ట్యాంకు ఎవరికి అడ్డు ఉంది..? ఎవరికోసం కూల్చిచేశారంటూ పలువురు ప్రశ్నిస్తున్నారు. ప్రజలకు దాహం తీర్చే వాటర్ ట్యాంకును కూల్చివేసి పాపాన్ని మూట కట్టుకున్నారని ప్రజలు శాపనార్థాలు పెట్టారు. ఆర్టీసీ బస్టాండ్ మూలమలుపు వద్ద ప్రజల సౌకర్యార్థం కోసం గతంలో మంచినీటి వాటర్ ట్యాంకు నిర్మించారని కొంతమంది అయ్యప్ప భక్తులు వివరించారు. ఈ ట్యాంకు ఎవరికి అడ్డులేకున్నప్పటికీ బుధవారం అర్ధరాత్రి ఆర్టీసీ అధికారులు కక్షగట్టి కూల్చివేశారని పలువురు ఆరోపిస్తూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక వ్యాపారస్తుడి కోసమే ఈ వాటర్ ట్యాంకును గుడి ప్రహరీ గోడను కూల్చివేసినట్లుగా కొంతమంది సామాజిక కార్యకర్తలు ఆరోపించడం గమనార్హం. అర్ధరాత్రి దొంగల్లాగా వచ్చి కూల్చివేతలకు శ్రీకారం చుట్టడం సిగ్గుచేటు అన్నారు. ఈ అక్రమ కూల్చివేతలపై స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లుగా కొంత మంది భక్తులు వివరించారు.


