ఘంటసాల నేటి కళాకారులకు స్ఫూర్తి
ఆచార్య డాక్టర్ మద్దెల శివకుమార్
కాకతీయ, కొత్తగూడెం : భగవద్గీత లాంటి కళాఖండికలను అద్భుతంగా గానం చేసిన ఘంటసాల నేటి యువ కళాకారులకు స్ఫూర్తిదాయకుడని అభ్యుదయ కళా సేవా సమితి రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షుడు కవి సినీ గీత రచయిత డాక్టర్ మద్దెల శివకుమార్ అన్నారు. స్థానిక బస్టాండ్ సెంటర్ వద్ద గల సంఘ కార్యాలయంలో గురువారం అభ్యుదయ కళాశాల సమితి ఆధ్వర్యంలో స్వర్గీయ పద్మశ్రీ ఘంటసాల మూడవ జయంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఘంటసాల చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మద్దెల శివకుమార్ మాట్లాడుతూ అభ్యుదయ కళాసేవ సమితి ఆధ్వర్యంలో ఎన్నో ఘంటసాల సంగీత విభావరులు గతంలో నిర్వహించడం జరిగిందని పేర్కొన్నారు. వేడుకలలో సంఘ ప్రధాన కార్యదర్శి అపరబాలు అల్లి శంకర్, సంఘ గౌరవ అధ్యక్షులు ప్రముఖ సంగీత దర్శకులు మారపాక కృష్ణస్వామి, సంఘ ఆత్మీయ అధ్యక్షులు గాంధీ పదం చారిటబుల్ ట్రస్ట్ జిల్లా అధ్యక్షులు చింతలచెరువు గిరీశం, సత్యం ఫౌండేషన్ అధ్యక్షులు సామాజిక సేవ తత్పరులు పొన్నెకంటి సంజీవరాజు, సంఘ మహిళ నాయకురాలు కే.మునీల, సంఘ రాష్ట్ర ఉపాధ్యక్షులు పి.సురేందర్, ఆస్థాన ప్రచార కార్యదర్శి ఛానల్ అధినేత రామ నర్సింహ, సుధాకర్ తదితరులు పాల్గొన్నారు


