డివైడర్‌ను ఢీకొట్టిన కారు
ముగ్గురు యువకులు మృతి
కాకతీయ, ఖమ్మం ప్రతినిధి : ఖమ్మం జిల్లా సత్తుపల్లి లో బుధవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. టీజీ 04 ఏ 4744 టాటా ఆల్ట్రోజ్ కారులో వియం బంజర్ వైపు నుంచి సతుపల్లి వెళ్తుండగా కిష్టారం, అంబేద్కర్ కాలనీ వద్ద రోడ్డు మధ్యలో ఉన్న డివైడర్‌ను బలంగా ఢీకొట్టింది.

ఈ ఘటన కారులో ప్రయాణిస్తున్న సత్తుపల్లి కొంపల్లి కాలనీ చెందిన విద్యార్థులు సిద్దెసి జయ్ (18సం) మార్సకట్ల శశి, (11సం) చంద్రుగొండ మండలం, మహబూబ్ నగర్ చెందిన సాజిద్ (25 సం)అక్కడికక్కడే మృతి చెందారు. అదే కారులో ఉన్న మరో ఇద్దరు యువకులు తలారి అజయ్, ఇమ్రాన్ లకు తీవ్ర గాయాలు అయ్యాయి. సమాచారం తెలుసుకున్న స్థానిక సత్తుపల్లి ఇన్స్పెక్టర్ శ్రీహరి, పోలీసులు ఘటన ప్రాంతానికి చేరుకొని క్షతగాత్రులను సత్తుపల్లి హాస్పిటల్ కు తరలించి బాధిత కుటుంబాలకు సమాచారం అందించారు. ప్రమాదానికి సంబంధించి విచారణ జరుపుతున్నట్టు కల్లూరు ఏసీపీ వసుంధర యాదవ్ తెలిపారు.


