మద్యం మానలేక వ్యక్తి ఆత్మహత్య
కాకతీయ, జగిత్యాల రూరల్: జగిత్యాల మండలంలోని లక్ష్మీపూర్ గ్రామంలో దారుణ ఘటన చోటుచేసుకుంది. ఆల్కహాల్‌కు బానిసైన వ్యక్తి మానసిక ఒత్తిడితో ఆత్మహత్య చేసుకున్నాడు. గ్రామానికి చెందిన గుండ భీమలింగం (59) గడిచిన కొద్దిరోజులుగా మద్యం వ్యసనంతో తీవ్ర ఇబ్బందులు పడుతూ, తాగుడు మానలేకపోతున్నాననే బాధతో తీవ్ర మనస్తాపానికి గురయ్యాడని కుటుంబ సభ్యులు తెలిపారు.ఈ నేపథ్యంలో సోమవారం మధ్యాహ్నం రెండు గంటల సమయంలో ఇంట్లో ఎవరూ లేని వేళ భీమలింగం ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఘటనను గమనించిన కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం ఇచ్చారు.మృతుని భార్య గుండ లింగవ్వ ఇచ్చిన ఫిర్యాదు మేరకు జగిత్యాల రూరల్ పోలీసు స్టేషన్‌లో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.


