కేసీఆర్ దీక్షతోనే తెలంగాణ
రాష్ట్ర సాధనలో సింగరేణి కార్మికుల పాత్ర మరువలేనిది
బీసీలకు అండగా బీఆర్ఎస్
దమ్ముంటే పార్లమెంట్ లో బీసీ బిల్లు పెట్టండి
దీక్ష దివస్ లో రాజ్యసభ సభ్యుడు : వద్ది రాజు రవిచంద్ర
కాకతీయ, కొత్తగూడెం : కేసీఆర్ పోరాటంతోనే తెలంగాణ రాష్ట్ర వచ్చిందని ఈ విషయాన్ని కాంగ్రెస్ పెద్దలు గ్రహించాలని రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర అన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలోని శనివారం బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ లో నిర్వహించిన దీక్ష దివస్ కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. జిల్లా పార్టీ అధ్యక్షుడు రేగా కాంతారావు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ముందుగా ప్రగతి మైదానంలో అమరవీరుల స్థూపానికి నివాళులర్పించారు. తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాల వేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ సాధనలో సింగరేణి కార్మికులు కూడా కీలక పాత్ర పోషించారని అన్నారు. నాడు కేసీఆర్ తెచ్చిన తెలంగాణ వల్లే నేడు ఎంతో మంది నాయకులు ప్రజా ప్రతినిధులుగా పదవులు అనుభవిస్తున్నారని అది కాంగ్రెస్ నాయకులు తెలుసుకోవాలని అన్నారు. కేసీఆర్ లేని తెలంగాణ ఎవరు చూడలేరని అన్నారు. మళ్లీ అధికారంలోకి వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని అన్నారు. బీసీలను మోసం చేసి రిజర్వేషన్లకి అడ్డుపడ్డారని దమ్ముంటే ఎంపీటీసీ ఎన్నికల కైనా బీసీ రిజర్వేషన్లు అమలు చేయాలని పార్లమెంటులో బీసీ బిల్లు పెట్టాలని అన్నారు. స్థానిక సర్పంచ్ ఎన్నికల్లో బీఆర్ఎస్ సత్తా చూపెడతామని అందుకు కార్యకర్తలంతా సిద్ధంగా ఉండాలని అన్నారు. జిల్లా అధ్యక్షుడు రేగా కాంతారావు మాట్లాడుతూ కేసీఆర్ చేసిన అంకుటిత దీక్ష వల్లనే మనకు తెలంగాణ వచ్చిందని ఎంతోమంది నాయకులు తెలంగాణ కోసం కష్టపడిన చివరికి సాధించలేకపోయారని కానీ అది కేసీఆర్ వల్లే సాధ్యమైందని అన్నారు. కేసీఆర్ తెలంగాణ తీసుకురావడం వల్లనే ఈరోజు ముఖ్యమంత్రి స్థానంలో రేవంత్ రెడ్డి ఉన్నారని లేకుంటే ఇలాంటి పదవులు వచ్చాయా అని ప్రశ్నించారు. మాజీ మంత్రి వనమా వెంకటేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యేలు మెచ్చ నాగేశ్వరావు, హరిప్రియ, తెలంగాణ ఉద్యమకారుడు ఉమ్మడి ఖమ్మం జిల్లా మాజీ అధ్యక్షుడు దిండిగల రాజేందర్ లు ఈ సమావేశంలో కేసీఆర్ ఉద్యమం గురించి తెలంగాణ సాధన గురించి మాట్లాడారు. స్థానిక ఎన్నికల్లో బీఆర్ఎస్ సత్తా చూపెడతామని అన్నారు. అనంతరం కెసిఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో భద్రాచలం ఇంచార్జ్ రావులపల్లి రాంప్రసాద్, పాల్వంచ నాయకులు మంతపురి రాజు గౌడ్, కొట్టి వెంకటేశ్వర్లు, కాంపెల్లి కనకేష్, సింధు తపస్వి, సంకు బాపన అనుదీప్, బత్తుల వీరయ్య, రాజశేఖర్, నవతన్, మాజీ ఎంపీపీలు సోనా, శాంతి, అరుణ తదితరులు పాల్గొన్నారు.


