క్యాంపస్ ప్లేస్‌మెంట్స్‌కు 11 మంది విద్యార్థుల ఎంపిక
కాకతీయ, ఖమ్మం : బొమ్మ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ కళాశాల లోని వివిధ కోర్సుల విద్యార్థులకు సాఫ్ట్వేర్ కంపెనీ అయిన క్యూ స్పైడర్స్ కంపెనీ క్యాంపస్ డ్రైవ్ నిర్వహించింది.4 వ సంవత్సర బీటెక్ చివరి సంవత్సరం చదువుతున్న విద్యార్థులు ఇంటర్వ్యూల్లో పాల్గొని విజయవంతంగా ఎంపిక అయ్యారు. ఈ క్యూ స్పైడర్స్ కంపెనీ ద్వారా మొత్తం 11 మంది విద్యార్థులకు జాబ్ ఆఫర్ లెటర్స్ అందించారు. ఈ సందర్భంగా కళాశాల ఛైర్మన్ విద్యార్థులను అభినందిస్తూ మాట్లాడుతూ గత సంవత్సరం 157 మంది విద్యార్థులు ప్లేస్‌మెంట్ పొందగా, ఈ సంవత్సరం 200 మంది విద్యార్థులకు పైగా ప్లేస్‌మెంట్స్ ఇవ్వడమే మా లక్ష్యమని తెలిపారు. ఈ క్యాంపస్ డ్రైవ్ విజయవంతం కావడానికి కృషి చేసిన ప్రిన్సిపాల్ , సెక్రటరీ , ప్లేస్‌మెంట్ సెల్ వారికి కూడా ఆయన ధన్యవాదాలు తెలిపారు. లలిత సతీష్, మీనాక్షి, జనార్ధన్, ధనాల్, రుష్మ, రష్మీ, నవ్య శ్రీ రుచి తదితరులు ఉన్నారు.


