epaper
Monday, March 2, 2026
epaper

కేంద్ర మంత్రి గడ్కరీకి తుమ్మల లేఖ

కేంద్ర మంత్రి గడ్కరీకి తుమ్మల లేఖ
ఖమ్మం–అశ్వారావుపేట రోడ్డును వన్ టైం ఇంప్రూవ్మెంట్ (రెన్యువల్) చేయండి
కొణిజర్ల, కల్లూరు, పెనుబల్లి, దమ్మపేట జంక్షన్ల‌ను ఆధునీకరించండి
4 లైన్ల రహదారి, డివైడర్, సెంట్రల్ లైటింగ్ మరియు డ్రైన్లు మెరుగుపరచాలి
రీజనల్ ఆఫీసర్ మోర్తా కృష్ణ ప్రసాద్ కు సైతం లేఖ రాసిన మంత్రి
సానుకూలంగా స్పందించిన కేంద్రమంత్రి గడ్కరీ, రీజనల్ ఆఫీసర్

కాక‌తీయ‌, ఖ‌మ్మం ప్ర‌తినిధి : కేంద్ర రహదారి రవాణా మ‌రియు హైవేల శాఖ మంత్రి నితిన్ గడ్కరీకి మంగళవారం రాష్ట్ర వ్యవసాయ శాఖ మాత్యులు శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు లేఖ రాశారు. అనంతరం కేంద్రమంత్రి తో ఫోన్లో మాట్లాడిన ఆయన ఖమ్మం–అశ్వారావుపేట జాతీయ రహదారిపై అత్యవసరంగా వన్ టైం ఇంప్రూవ్మెంట్ (రెన్యువల్) పనులు తక్షణమే చేపట్టాలని కేంద్ర మంత్రిని కోరారు. ఇప్పటికే ఈ రహదారి నాలుగు లైన్లుగా విస్తరించేందుకు డిపిఆర్ సిద్ధం చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఆ పనులు ప్రారంభం కావాలంటే సంవత్సరం సమయం పడుతుందని లేఖలో పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ రోడ్డు వర్షాల కారణంగా గుంతలు ఏర్పడి అధ్వానంగా ఉందని ప్రయాణికులు వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని మంత్రి లేఖలో ప్రస్తావించారు. అంతరాష్ట్ర ప్రాధాన్యం కలిగిన ఖమ్మం–అశ్వారావుపేట రహదారి జాతీయ రహదారి 365BBలో భాగమై, రాబోయే NH–365BG గ్రీన్‌ఫీల్డ్ హైవే మార్గంలోనూ ఉండటంతో ఈ మార్గానికి వ్యూహాత్మక ప్రాధాన్యం పెరిగిందని మంత్రి తుమ్మల చెప్పారు. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ లోని కాకినాడ, వైజాగ్ పోర్టులకు వెళ్లే వాహనాలు మరియు హైదరాబాద్ నుంచి ఆంధ్రకు వెళ్లే వాహనాలు కూడా అధికంగా ఈ రహదారినే వినియోగిస్తున్నట్టు తెలిపారు. అయితే ప్రస్తుత రహదారి తీవ్రంగా దెబ్బతినడం, గుంతల వల్ల ప్రమాదాలు పెరుగుతున్న నేపథ్యంలో ఈ రోడ్డుకు పునరుద్ధరణ పనులు చేయడం అత్యవసరమని మంత్రి పేర్కొన్నారు.

ప్రస్తుత పరిస్థితి అత్యవసర దశలో…

రహదారిని ఫోర్ లైన్ గా విస్తరించేందుకు డీపీఆర్ సిద్ధం చేసే పనులు ప్రారంభమైనప్పటికీ, ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా డీపీఆర్‌ సిద్ధం చేయడానికి మరింత సమయం పడుతుందని మంత్రి తుమ్మల లేఖలో స్పష్టం చేశారు. 4 లేన్ల రోడ్డు ప్రాజెక్టులు పూర్తికావడానికి సమయం పట్టే అవకాశం ఉన్నందున, ప్రస్తుత NH–365BB పై వన్ టైం ఇంప్రూవ్మెంట్ చేపట్టడం తప్పనిసరి అని మంత్రి తుమ్మల లేఖలో స్పష్టం చేశారు. జగ్గయ్యపేట–కొత్తగూడెం వయా వైరా జాతీయ రహదారిని మంజూరు చేయాలని గడ్కరీ ని తుమ్మల కోరారు. జాతీయ రహదారి 65 మీద ఉన్న జగ్గయ్యపేట నుంచి జాతీయ రహదారి 30 మీద ఉన్న కొత్తగూడెం వరకు కొత్త జాతీయ రహదారి ఆమోదం లభిస్తే రెండు ప్రధాన జాతీయ రహదారులు అనుసంధానం కావడంతో పాటు తెలంగాణ–ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల ప్రజలకు వేగవంతమైన, సురక్షితమైన రవాణా సౌకర్యం అందుబాటులోకి వస్తుందని మంత్రి పేర్కొన్నారు. జగ్గయ్యపేట నుంచి బోనకల్, వైరా, తల్లాడ మీదుగా కొత్తగూడెం వరకు ఈ రహదారిని మంజూరు చేయాలని ఆయన కోరారు. ప్రస్తుతం ఈ మార్గం రాష్ట్ర రహదారిగా ఉన్నదని, దీనిని జాతీయ రహదారిగా అప్‌గ్రేడ్ చేసినట్లయితే భద్రాచలం దర్శనార్థం వచ్చే భక్తులకు కూడా మరింత సౌకర్యవంతమైన ప్రయాణాన్ని కల్పించవచ్చని మంత్రి తెలిపారు. అంతేకాకుండా, ఈ రహదారి అభివృద్ధి ద్వారా ప్రధాన పరిశ్రమల క్లస్టర్ల మధ్య కనెక్టివిటీ మెరుగుపడటంతో జగ్గయ్యపేట సిమెంట్ పరిశ్రమలు, అలాగే కొత్తగూడెం, పాల్వంచ, అశ్వపురం, మణుగూరు ప్రాంతాల్లోని పరిశ్రమలకు రవాణా సదుపాయాలు గణనీయంగా మెరుగుపడతాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

జంక్షన్లు మున్సిపాలిటీ ల అభివృద్ధి

కొణిజర్ల ,కల్లూరు మున్సిపాలిటీ,పెనుబల్లి, దమ్మపేట (మందలపల్లి) జంక్షన్లలో తరచూ ప్రమాదాలు జరుగుతున్నందున వాటిని ఆధునిక ప్రమాణాలతో అభివృద్ధి చేయాలని మంత్రి గడ్కరిని కోరారు. అలాగే ఈ ప్రాంతాల్లో కొత్తగా నాలుగు వరుసల రహదారి,సెంట్రల్ లైటింగ్, డివైడర్లు, డ్రైనేజీ వ్యవస్థ వంటి ఏర్పాట్లు అత్యవసరమని, కాబట్టి వీటిని వెంటనే మంజూరు చేయాలని మంత్రి తుమ్మల కోరారు. ఇదే అంశంపై మినిస్ట్రీ ఆఫ్ రోడ్స్ అండ్ ట్రాన్స్పోర్ట్ హైవే ల రిజినల్ ఆఫీసర్ కృష్ణ ప్రసాద్‌కూ వేరుగా లేఖ రాసినట్టు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పేర్కొన్నారు. ప్రమాదాల నియంత్రణ, రాకపోకల సౌలభ్యం, ఖమ్మం జిల్లాకు నిరంతర రహదారి అనుసంధానానికి ఈ పనులు అత్యంత కీలకమన్న మంత్రి తుమ్మల, అవసరమైన అనుమతులు, నిధులు వెంటనే మంజూరు చేసి తక్షణమే పనులు ప్రారంభించాలని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీని కోరారు. దీనికి స్పందించిన కేంద్రమంత్రి తక్షణమే పనులు ప్రారంభించేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

ఎస్సీ వర్గీకరణ పోరులో అమరవీరులకు జోహార్లు

ఎస్సీ వర్గీకరణ పోరులో అమరవీరులకు జోహార్లు సింగరేణిలో ఎమ్మార్పీఎస్ గద్దె వద్ద నివాళులు త్యాగాలు...

బొగ్గు–ఇసుక లారీల బీభత్సం..!

బొగ్గు–ఇసుక లారీల బీభత్సం..! మణుగూరు–బయ్యారం రహదారి ధ్వంసం దుమ్ము ధూళితో గిరిజన బిడ్డల అనారోగ్యం ప్రజల...

అదుపుతప్పిన ఇసుక ట్రాక్టర్ – డ్రైవర్ దుర్మరణం

అదుపుతప్పిన ఇసుక ట్రాక్టర్ – డ్రైవర్ దుర్మరణం నాగులవంచ వద్ద తెల్లవారుజామున ప్రమాదం ఓవర్‌టేక్...

వెలుగుమట్ల బాధితులపై ముమ్మర సర్వే

వెలుగుమట్ల బాధితులపై ముమ్మర సర్వే 21 మంది తహశీల్దార్లతో యుద్ధప్రాతిపదికన సర్వే ఖమ్మం జిల్లాకు...

వెలుగుమట్ల బాధితులకు బీఆర్ఎస్ అండ

వెలుగుమట్ల బాధితులకు బీఆర్ఎస్ అండ ఎంపీ వద్దిరాజు రవిచంద్ర ఆధ్వర్యంలో భోజనాల పంపిణీ కాకతీయ,...

సీఎం రేవంత్ రెడ్డికి సన్మానసభ పోస్టర్ ఆవిష్కరణ

సీఎం రేవంత్ రెడ్డికి సన్మానసభ పోస్టర్ ఆవిష్కరణ కాకతీయ, ఖమ్మం : ఎస్సీ...

భూదాన్ వ్యవహారంలో విపక్షాలే అభాసు

భూదాన్ వ్యవహారంలో విపక్షాలే అభాసు పేదల పేరుతో రాద్ధాంతం చేశారు ఏజెంట్ల మోసాలపై బాధితులకు...

మోదీ పాలనలో దేశానికి ప్రమాదం

మోదీ పాలనలో దేశానికి ప్రమాదం కార్పొరేట్ల కోసమే కేంద్రం విధానాలు సీపీఐ (ఎం) పొలిట్...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!?

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!? సీజ్ చేసిన క‌ల‌ప‌ మాయం..?! ములుగు జిల్లా అట‌వీశాఖ‌లో క‌ల‌క‌లం వేరే...

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్ 116 మునిసిపాలిటీలు.. 7కార్పోరేష‌న్ల‌లో న‌మోదైన పోలింగ్ శాతం వివ‌రాలు ఒక్క...

ఔష‌ధం కాదు.. ! విషం..!!

ఔష‌ధం కాదు.. ! విషం..!! తెలంగాణలో తయారైన 35ర‌కాల మందులు ఫెయిల్‌ సీడీఎస్‌సీవో తనిఖీల్లో...

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..!

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..! చరిత్రకు జానపద స్వరం..అద్భుతం పాట రూపంలో సమ్మక్క–సారలమ్మ...

మేడారంలో హైటెక్ భద్రత

మేడారంలో హైటెక్ భద్రత మూడు కోట్ల మందికిపైగా భక్తుల రాక అంచనా కమాండ్ కంట్రోల్...

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...
spot_img

Popular Categories

spot_imgspot_img