జర్నలిస్టు సమస్యలపై ఐక్యంగా పోరాడుదాం
టీడబ్ల్యూ జేఎప్ జిల్లా అధ్యక్షులు పల్లా కొండలరావు
బోనకల్ ప్రెస్ క్లబ్ లో టి. డబ్ల్యూ. జె. ఎఫ్ సభ్యత్వ నమోదు కార్యక్రమం ప్రారంభం
కాకతీయ, ఖమ్మం : జర్నలిస్టు సమస్యలపై ఐక్యంగా పోరాడుదామని, ప్రతి జర్నలిస్టుకి టీ డబ్ల్యూ జె ఎఫ్ అండగా ఉంటుందని యూనియన్ జిల్లా అధ్యక్షులు పల్లా కొండలరావు తెలిపారు. ఆదివారం మండల కేంద్రంలోని ప్రెస్ క్లబ్ కార్యాలయంలో సంఘం సభ్యత్వ నమోదు కార్యక్రమం ప్రారంభించారు.10 మంది జర్నలిస్టులకు యూనియన్ సభ్యత్వాన్ని అందజేశారు. ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు డేగల వేలాద్రి అధ్యక్షతన జరిగిన సభలో మిగతా జర్నలిస్టులకు కూడా స్థానిక నాయకులు సభ్యత్వం అందించాలని పల్లా కొండలరావు కోరారు. ఎన్నో సంవత్సరాలుగా జర్నలిస్టులుగా పనిచేస్తున్న వారికి ఇళ్ల స్థలాలు, హెల్త్ కార్డులు, అక్రిడేషన్ కార్డులు, ఇవ్వకుండా ప్రభుత్వం తాత్సారం చేస్తుందని, జర్నలిస్టుల సమస్యల పరిష్కారంలో యూనియన్ జర్నలిస్టులకు అండగా ఉంటుందని అన్నారు. సభ్యత్వ నమోదు కార్యక్రమం మధిర నియోజకవర్గంలో అన్ని మండలాల్లో చేపట్టనున్నట్టు ఆయన తెలిపారు. జర్నలిస్టులందరూ తమ వృత్తి నైపుణ్యాలను మెరుగుపరచుకోవాలని, ప్రజలు ప్రభుత్వానికి మధ్య వారధిగా ఉంటూ ప్రజాక్షేత్రంలో సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని అన్నారు. కార్యక్రమంలో యూనియన్ జిల్లా కోశాధికారి తేనె వెంకటేశ్వర్లు, ప్రెస్ క్లబ్ గౌరవ సలహాదారు యంగల అమరయ్య, ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు డేగల వేలాద్రి, ఉపాధ్యక్షుడు మంద సత్యానందం, కార్యదర్శి యంగల గౌతం, వర్కింగ్ ప్రెసిడెంట్ ఎస్ కే బడే,సభ్యులు బాజీ షరీఫ్, కొణతాలపల్లి నాగేశ్వరరావు, తగరం రమేష్,ఎస్.కె మదార్ సాహెబ్ తదితరులు పాల్గొన్నారు.


