కాంగ్రెస్‌లో భారీగా చేరికలు
కాకతీయ, ఖమ్మం రూరల్ : పాలేరు నియోజకవర్గం ఖమ్మం రూరల్ మండలం ఎం. వెంకటాయపాలెం గ్రామంలో ఆదివారం జరిగిన కార్యక్రమంలో పలు పార్టీలకు చెందిన 50 కుటుంబాలు కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్నారు. తెలంగాణ రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి క్యాంప్ ఆఫీస్ ఇంచార్జ్ తంబూరు దయాకర్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ చేరికలు జరిగాయి. చేరిక సభలో మద్దులపల్లి మార్కెట్ కమిటీ చైర్మన్ బైరు హరినాథ్ బాబు, రూరల్ మండల అధ్యక్షుడు కళ్లెం వెంకటరెడ్డి, అజ్మీర అశోక్ నాయక్, కందుకూరి వెంకట్ నారాయణ, తిప్పిరెడ్డి రాజశేఖర్ రెడ్డి, నాగమణి, బేతంపూడి రాయుడు, నాగండ్ల ఉపేందర్, కొమ్ము వెంకన్న, కొమ్ము నాగయ్య, వడ్లమూడి భాస్కర్, మద్దెల నాగయ్య, బేతంపూడి మధు, రామగిరి సత్యం, పడియాల వెంకట్ నారాయణ, జంపయ్య, రాజు, సుందర్ రావుతో పాటు స్థానిక నాయకులు, కార్యకర్తల పాల్గొన్నారు.



