epaper
Monday, December 1, 2025
epaper

ఓట‌మి నుంచి పాఠాలు నేర్చుకోండి

ఓట‌మి నుంచి పాఠాలు నేర్చుకోండి
ప్రతీ ఒక్క‌రూ నిర్ధిష్ఠ ల‌క్ష్యం నిర్దేశించుకోవాలి
నాలుగు సార్లు సివిల్స్‌లో ఫెయిల‌య్యా..!
ఐదోసారి సివిల్స్‌లో ఇండియా టాప‌ర్‌గా నిలిచా
ఎన్‌సీసీ డే వేడుకలలో ఖ‌మ్మం కలెక్టర్ అనుదీప్ స్ఫూర్తిదాయ‌క ప్ర‌సంగం

కాకతీయ, ఖమ్మం ప్రతినిధి : జీవితంలో ఉన్నత స్థానాలకు చేరుకుని, ఇతరులకు ఆదర్శంగా నిలిచేలా ప్రతి విద్యార్థి ఎదగాలని జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి తెలిపారు. ఎస్ఆర్ అండ్ బీజీఎన్ఆర్ కళాశాల ఆడిటోరియంలో ఆదివారం నిర్వహించిన ఎన్.సి.సి. డే వేడుకలలో జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి ఎన్.సి.సి. డే వేడుకలలో పాల్గొని అద్భుతంగా నృత్య ప్రదర్శనలు చేసిన విద్యార్థులను ప్రత్యేకంగా అభినందించారు. 20 లక్షలకు పైగా యువత సభ్యత్వంతో ఎన్.సి.సి. సంస్థ పని చేస్తుందని, ఇందులో భాగస్వామ్యం కావడం విద్యార్థుల అదృష్టమని అన్నారు. క్రమశిక్షణ, దేశం గొప్పతనం, దేశానికి మనం ఎలా ఉపయోగపడాలి అనే భావన విద్యార్థులలో ఎన్.సి.సి. ప్రేరేపిస్తుందని, జీవితం ఉత్తమంగా గడిపేందుకు అవసరమైన జీవన నైపుణ్యాలు ఎన్.సి.సి. సంస్థ విద్యార్థులకు నేర్పిస్తుందని అన్నారు. విజయం కోసం మాత్రమే పని చేస్తే మంచి ఫలితాలు రావాలని, మనం చేసే ప్రతి పని అద్భుతంగా చేసినప్పుడు ఆటోమేటిక్ గా విజయవంతం అవుతామని అన్నారు. మనం చేసే ప్రతి పనిలో 100 శాతం మనం ఎఫర్ట్ పెట్టాలని అన్నారు. ‌వైఫల్యాలు లేకుండా గొప్ప స్థానానికి ఎదిగిన వ్యక్తులు మనకు సమాజంలో ఎవరూ కనబడరని, వైఫల్యాల నుంచి నేర్చుకున్న పాఠాలు సరి చేసుకుంటూ పని చేస్తే విజయం సాధిస్తామని అన్నారు. ప్రతి ఒక్కరూ ఒక నిర్దిష్ట లక్ష్యాన్ని పెట్టుకొని, దానిని సాధించే దిశగా కృషి చేయాలని అన్నారు. చిన్నతనం నుంచి ఒక మంచి ఐఏఎస్ కావాలని తన లక్ష్యాన్ని 5వ అటెంప్ట్ లో సాధించానని, నాలుగు సార్లు వైఫల్యం చెందిన నిరుత్సాహ పడకుండా చేసిన తప్పులను సరి చేసుకుంటూ లక్ష్యం వైపు ప్రయాణం కొనసాగించడం వల్లే ఆల్ ఇండియా టాపర్ వన్ గా సివిల్స్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించానని అన్నారు.
వైఫల్యంతో జీవితం ముగిసిపోదని, ప్రతి వైఫల్యం నుంచి పాఠాలు నేర్చుకుంటూ మన నైపుణ్యాలను ఇంప్రూవ్ చేసుకుంటూ పనిచేస్తే మంచి విజయం సాధిస్తామని అన్నారు. మనం ఎంచుకున్న రంగంలో నిష్ణాతులుగా తయారు కావాలని , తల్లి దండ్రుల ఆశలను నెరవేర్చే దిశగా ముందుకు సాగాలని అన్నారు. ప్రతి ఒక్క విద్యార్థి జీవితంలో ఇతరులకు ఆదర్శంగా నిలిచే స్థాయికి ఎదగాలని కలెక్టర్ ఆకాంక్షించారు.అంతకుముందు విద్యార్థులు చేసిన సామాజిక ప్రదర్శనలు అందరిని ఆలోచనలు తట్టిలేపాయి. దేశభక్తి గీతాలతో చేసిన పలు రకాల నృతాలు ఆకట్టుకున్నాయి.ఈ కార్యక్రమంలో ఎన్.సి.సి. కమాండెంట్ నవీన్ యాదవ్, ఎస్.కె. భద్ర, పలు విద్యాసంస్థ నిర్వాహకులు రవిమారుతి, పార్వతీ రెడ్డి, అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

ముఖ్యమంత్రి పర్యటనకు పటిష్ట బందోబస్తు

ముఖ్యమంత్రి పర్యటనకు పటిష్ట బందోబస్తు జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్ కాకతీయ, కొత్తగూడెం రూరల్...

ఖ‌మ్మం జిల్లాలో పోలీసులు విస్తృత తనిఖీలు

ఖ‌మ్మం జిల్లాలో పోలీసులు విస్తృత తనిఖీలు కాకతీయ, ఖమ్మం ప్రతినిధి : గ్రామ...

31 మంది బెల్ట్ షాపులు నిర్వాహాకుల బైండోవ‌ర్

31 మంది బెల్ట్ షాపులు నిర్వాహాకుల బైండోవ‌ర్ కాకతీయ, ఖమ్మం ప్రతినిధి :...

నేను రైతు బిడ్డ‌నే.. వారి క‌ష్టాలేంటో నాకు తెలుసు

నేను రైతు బిడ్డ‌నే.. వారి క‌ష్టాలేంటో నాకు తెలుసు అన్న‌దాత‌ల‌కు అండగా ఉంటా...

అభివృద్ధి పనులు గడువులోగా పూర్తి చేయాలి

అభివృద్ధి పనులు గడువులోగా పూర్తి చేయాలి వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర...

పార్టీ బ‌లోపేతానికి కృషి చేయాలి

పార్టీ బ‌లోపేతానికి కృషి చేయాలి పార్టీ నేత‌ల‌కు కాంగ్రెస్ ఖ‌మ్మం న‌గ‌ర అధ్య‌క్షుడు...

ట్రస్ట్ ఆధ్వర్యంలో పలు గ్రామాలకు రగ్గుల పంపిణీ

ట్రస్ట్ ఆధ్వర్యంలో పలు గ్రామాలకు రగ్గుల పంపిణీ కాకతీయ, కొత్తగూడెం రూరల్ :...

విద్యార్థుల లక్ష్యాలకు వేదికగా “ఎర్త్ సైన్స్ యూనివర్సిటీ”

విద్యార్థుల లక్ష్యాలకు వేదికగా "ఎర్త్ సైన్స్ యూనివర్సిటీ" ప్రారంభానికి సమగ్ర ఏర్పాట్లు చేయాలి అధికారులు...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...

రేవంత్ కు కొత్త సవాల్!

* సర్కార్ కు పరీక్షగా సీఎస్ ఎంపిక? * ఈ నెలాఖరున రామకృష్ణారావు...

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం కాక‌తీయ‌, హైదరాబాద్ : రంగారెడ్డి జిల్లాలోని బాటసింగారంలో...

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన ప్రతిపాదించిన ప్రాజెక్టుపై...

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా న్యూ డిల్లీ జూలై...

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు మొన్న యూనివర్సిటీల్లో ఆందోళనలు నిషేధిస్తూ మెమో నేడు...

రాష్ట్రంలో హద్దులు దాటిపోతున్న ఫోన్‌ ట్యాపింగ్‌

రాష్ట్రంలో హద్దులు దాటిపోతున్న ఫోన్‌ ట్యాపింగ్‌ కాంగ్రెస్‌ దూత ఫోన్‌ ట్యాపింగ్‌..! గాంధీ...
spot_img

Popular Categories

spot_imgspot_img