పురాతన శివాలయానికి పునర్జీవం పోయాలని కాట్రపల్లి గ్రామస్థుల అభ్యర్థన
సానుకూలంగా స్పందించిన ప్రణవ్
ఆలయాల అభివృద్ధికి కట్టుబడి ఉంటాం
కాకతీయ,హుజురాబాద్: హుజురాబాద్ మండల పరిధిలోని కాట్రపల్లి గ్రామంలో గల అతి పురాతన శివాలయాన్ని హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జి వొడితల ప్రణవ్ సందర్శించారు.ఈ సందర్భంగా పలువురు గ్రామస్థులు ఆలయ చరిత్ర,ఇప్పుడున్న పరిస్థితిని ప్రణవ్ కు వివరించగా ఆలయ పునః నిర్మాణానికి సహకరించాలని కోరగా అభివృద్ధికి తనవంతుగా సహాయ,సహకారాలు అందజేస్తానని తెలిపారు.


