ఖమ్మం డిపో ఎదుట రూ. 2 కోట్ల స్థలానికి ఎసరు
అడ్డుకున్న యూనియన్ నేతలు, విశ్రాంత ఉద్యోగులు
సంఘీభావంగా ఇతర యూనియన్ నేతలు
అక్రమ రిజిస్ట్రేషన్ రద్దుచేసి, ఆ ఇద్దరిని అరెస్ట్ చేయాలి
ఆర్టీసీ డిపో వద్ద భారీ నిరసన
భవిష్యత్ తరాలకు ఉపయోగపడాలంటే ఆర్టీసీ బిడ్డలందరు ముందుకు రావాలి
కాకతీయ, ఖమ్మం: ఆర్టీసీ కార్మికుల విరాళాలతో కొనుగోలు చేసిన భవనాన్ని అక్రమ రిజిస్ట్రేషన్ చేయించుకున్న రూ. రెండు కోట్ల రూపాయల విలువ చేసే భూమి ని కాపాడేందుకు ఏపీఎస్ ఆర్టీసీ ఎన్ఎంయు యూనియన్ నేతలు, విశ్రాంత ఉద్యోగులు శనివారం ఖమ్మం ఆర్టీసీ డిపో ఎదుట ఆందోళన నిర్వహించారు. ఆర్టీసీలోని ఇతర సంఘ నేతల సైతం వీరికి సంఘీభావంగా నిరసన పాల్గొన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో 2002 కార్మికులకు, యూనియన్ నాయకులకు, ఉద్యోగులకు విశ్రాంత ఉద్యోగులకు అండగా ఉండాలని ఖమ్మం డిపో ఎదుట 350 గజాల భవనాన్ని యూనియన్ పేరిట కొనుగోలు చేశారు. నాటి నుంచి ఓ గదిలో యూనియన్ ఆఫీస్ కొనసాగుతుంది. యూనియన్ లోని ఇద్దరు నాయకులు (విశ్రాంత ఉద్యోగులు) అజయ్ కుమార్ ఎల్ ఆర్ కే రావు సుమారు 210 గజాల స్థలాన్ని అక్రమంగా రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. ఈ విషయం తెలుసుకున్న యూనియన్ నేతలు వారిపై న్యాయపోరాటం చేస్తూనే తాజాగా వారు ఆక్రమించుకునేందుకు ప్రయత్నిస్తుండగా అడ్డుకున్నారు. ఈ నేపథ్యంలో శనివారం వారు ఆందోళన చేపట్టారు. ఎన్ఎంయు రీజినల్ సెక్రటరీ ఆర్ వి వీరభద్రం, నాయకులు ఆర్ఎస్ రామారావు, రిటైర్డ్ ఎంప్లాయిస్ యూనియన్ చీఫ్ వైస్ ప్రెసిడెంట్ ఎస్ పాండురంగారావు, ఎన్ ఎమ్ యు మాజీ రీజనల్ సెక్రటరీ, రిటైర్డ్ ఎంప్లాయిస్ యూనియన్ స్టేట్ సెక్రటరీ వీ చక్రధర్ రావు, రిటైర్డ్ ఎంప్లాయిస్ రీజినల్ ప్రెసిడెంట్ బివి రావు తదితరులు మాట్లాడారు. ఖమ్మం భవన అక్రమ రిజిస్ట్రేషన్ రద్దు చేయాలని డిమాండ్ చేశారు. యూనియన్ ఆఫీస్ అన్యాక్రాంతం కాకుండా చూడాలన్నారు. కార్మిక యూనియన్ ద్రోహులను తరిమికొట్టాలని పిలుపునిచ్చారు. కార్మిక విరాళాలతో నిర్మించుకున్న ఆఫీసును అక్రమార్కుల నుంచి కాపాడాలన్నారు. యూనియన్ ఆఫీస్ ను అక్రమంగా తన బంధువు బుచ్చి రామారావు పేరుతో , కోర్టు వివాదాల ఉండగా తన కూతురు హర్ష చౌదరి పేరుతో రిజిస్టర్ చేయించుకున్న రిటైర్డ్ ఆర్టీసీ ఉద్యోగి అజయ్ కుమార్ పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. యూనియన్ రీజినల్ కార్యదర్శిగా ఉండి అక్రమంగా ఆఫీసును తన భార్య పేరుతో రిజిస్ట్రేషన్ చేయించుకున్న ఎల్ ఆర్ కె రావు కు తగిన బుద్ధి చెప్పాలన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్టీసీ ఎస్ డబ్ల్యూ ఎఫ్, ఎంప్లాయిస్ యూనియన్, తెలంగాణ మజ్దూర్ యూనియన్ నాయకులు, విశ్రాంత ఉద్యోగులు పెద్ద ఎత్తున ధర్నాలో పాల్గొన్నారు.



