చెకుముకి టాలెంట్ టెస్ట్‌లో శ్రీ రాగా స్కూల్‌కు ప్రథమ స్థానం
కొత్తగూడెం,కాకతీయ రూరల్: కొత్తగూడెం కార్పొరేషన్ పరిధిలోని మేధర బస్తిలో గల శ్రీ రాగా హై స్కూల్ విద్యార్థులు మండల స్థాయి చెకుముకి టాలెంట్ టెస్ట్‌లో అద్భుత ప్రతిభ చూపి ప్రైవేట్ స్కూల్స్ విభాగంలో ప్రథమ స్థానం సాధించారు.శుక్రవారం భజన మందిర, శ్రీ రామచంద్ర స్కూల్‌లో నిర్వహించిన ఈ పోటీల్లో విద్యార్థుల ప్రతిభను నిర్వాహకులు అభినందించారు.ప్రథమ స్థానం పొందిన వారికి అ సర్టిఫికెట్స్ మెమంటోలు బహుకరించారు.
ప్రథమ బహుమతి పొందిన పదవ తరగతి చదువుతున్నహేమంత్ నాయక్, 9వ తరగతి విద్యార్థి.రేశ్వంత్ ఎనిమిదవ తరగతి విద్యార్థి.శేష సాయి ఉన్నారుఈ సందర్భంగా పాఠశాలలో ఏర్పాటుచేసిన అభినందన సభలో కరస్పాండెంట్ మల్లారపు. వర ప్రసాద్ మాట్లాడుతూ స్కూల్ లో చిన్నారులకు అన్ని పోటీ పరీక్షల్లో ప్రతిభను వెలికి తీసేవిధంగా ఆబ్జెక్టివ్ ప్రోగ్రామ్ ను డిజైన్ చేసి ట్రైనింగ్ ఇస్తూ ఉన్నామని దానికి నిదర్శనమే ఈ విజయమని అంటూ విజేతలను అభినందించారు.అనంతరం స్కూల్ డైరెక్టర్ ఎం.కవిత విజేతలకు స్వీట్స్ తినిపించారు.
*ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు రాంబాబు, సర్వేశ్వర రావు , రేష్మా , నౌషిన్ , కవిత , రమేష్ , రాజు , సురేష్ , భువన , అనుష తదితరులు పాల్గొన్నారు


