- అధికారులకు పర్సనల్ డిపార్ట్‌మెంట్ జీఎం కవిత నాయుడు సూచన
కాకతీయ, కొత్తగూడెం : సింగరేణి ఉద్యోగుల కార్మికుల సమస్యల పరిష్కారానికి సంబంధిత శాఖ అధికారులు చొరవ చూపాలని సింగరేణి జిఎం పర్సనల్ కవితా నాయుడు సూచించారు. శుక్రవారం సింగరేణి ప్రధాన కార్యాలయంలో కవితా నాయుడు శ్రీరాంపుర్ రీజియన్ లోని బెల్లంపల్లి, మందమర్రి, ఎస్‌టిపిపి, శ్రీరాంపుర్ ఏరియాల పర్సనల్ డిపార్ట్మెంట్ల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ శ్రీరాంపుర్ రీజియన్ లోని బెల్లంపల్లి, మందమర్రి, ఎస్‌టిపిపి, శ్రీరాంపుర్ ఏరియాల వారిగా 2023-2024 సంవత్సరాలలో గుర్తించబడిన దీర్ఘకాలిక గైర్హాజరైన ఉద్యోగులపై తీసుకున్న క్రమశిక్షణాచర్యల గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఉద్యోగుల కార్మికుల సమస్యలు ఏమైనా ఉంటే వెంటనే వాటి పరిష్కారాన్ని కృషి చేయాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఏజిఎం(పర్సనల్)లు జి.రాజేంద్ర ప్రసాద్, కే.అజయ్ కుమార్, డిజిఎం(పర్సనల్) ఎస్.వేంకటేశ్వరరావు, ఏరియాల పర్సనల్ డిపార్ట్మెంట్ అధికారులు ఎస్.అనిల్ కుమార్, సిహెచ్.అశోక్, మోహన్ సింగ్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.


