epaper
Friday, November 21, 2025
epaper

శాపంగా మారిన నిర్లక్ష్యం

శాపంగా మారిన నిర్లక్ష్యం
నిరుద్యోగుడిని వెంటాడిన దురదృష్టం
గ్రామీణ పోస్టల్ శాఖ సిబ్బంది నిర్లక్ష్యం
యువకుడు చేజార్చుకున్న ఎస్సై ఉద్యోగం
న్యాయం కోరుతూ జిల్లా కలెక్టర్ ఎస్పీకి ఫిర్యాదు

కాకతీయ ,కొత్తగూడెం రూరల్: మదినిండా ఎన్నో ఆశలు.. ఎంత కష్టమైనా సరే ప్రభుత్వ ఉద్యోగం సంపాదించాలని ఆ యువకుడి పట్టుదల.. ఒకవైపు ఆ యువకుడి వెంటాడుతున్న పేదరికం.. అయినప్పటికీ మనో ధైర్యం తో అడుగు ముందుకు వేసి.. ఎట్టకేలకు కోరుకున్న కొలువు సాధించాడు.. అధికారుల చేత ఔరా అనిపించుకున్నాడు.. తాను బ్రతుకుతున్న నక్సల్స్ ప్రభావిత ప్రాంతంలో పోలీస్ శాఖలో ఎస్సై ఉద్యోగానికి శతవిధాల కష్టపడ్డాడు.. నీకు ఎలా వస్తుంది రా ఉద్యోగం అని హేళన చేసిన వారీ దిమ్మతిరిగేలా అందరూ అనుకున్నట్లుగానే ఎస్సై కొలువుకు అర్హత సాధించాడు. అయినప్పటికీ ఏమి లాభం పోస్టల్ ఉద్యోగుల నిర్లక్ష్యం ఆ యువకుడికి శాపంగా మారింది. కొలువు వస్తుందిలే అని ఆశపడ్డ ఆ గిరిజనుడికి నిరాశే మిగిలింది. పోస్టల్ ఉద్యోగుల నిర్లక్ష్యం ఏమిటో తెలుసుకుందామా….
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బంగారు చిలక పంచాయతీ పరిధిలోని పూర్తి నక్సల్స్ ప్రభావిత ప్రాంతమైన కొత్త చింతకుంట గ్రామానికి చెందిన కోర్సా శరత్ బాబు, బీటెక్ పూర్తి చేశారు. తన తండ్రి లక్ష్మీనారాయణ వ్యవసాయం కుటుంబాన్ని సాకుతున్నాడు. వ్యవసాయంలో తండ్రి పడుతున్న బాధను చూసి తట్టుకోలేని ఆ యువకుడు 2018 సంవత్సరంలో ఎస్సై ఉద్యోగానికి దరఖాస్తు చేసుకున్నాడు. 2019 సంవత్సరంలో కొత్తగూడెంలోని సి ఈ ఆర్ క్లబ్లో జూన్ 17వ తేదీన ఎస్సై కు కావలసిన అన్ని అర్హత పరీక్షలకు ఆ గిరిజన యువకుడు అర్హత సాధించాడు. వెంటనే ఉద్యోగం ఇవ్వాల్సిన ఆనాటి ప్రభుత్వం డబ్బున్నోడికే ఉద్యోగం అంటూ డబ్బులు పెట్టి కొందరికి ఉద్యోగం అంటగట్టిన ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ చేపట్టిన ఎస్సై కొలువులు సరైన పద్ధతితో నిర్వహించలేదని అక్రమంగా నియామకాలు చేపట్టారని తనకు డబ్బు లేకనే ఉద్యోగం రాలేదని నిరసిస్తూ ఆనాటి నోటిఫికేషన్ చైర్మన్ (టీఎస్ ఎల్పిఆర్బి) కు ఫిర్యాదు చేశాడు. దాంతో ఆగ్రహించిన నోటిఫికేషన్ చైర్మన్ ఆ యువకుడికి సమాధానం చెప్పాల్సిన అవసరం లేదని తేల్చి చెప్పడంతో చేసేదేమి లేక ఆ యువకుడు న్యాయం కోరుతూ 2021న ఆర్టిఏ కమిషన్ ను ఆశ్రయించాడు ఆ గిరిజన యువకుడు చేసిన ఫిర్యాదును పరిశీలించిన ఆర్టిఐ కమిషన్ 2021 అక్టోబర్ 28న సంబంధిత డీజీపీ నోటిఫికేషన్ చైర్మన్ అధికారులందరూ హాజరుకావాలని ఆదేశించినట్టు తెలిపాడు. ఆర్టిఏ కమిషన్ కూడా ఆ యువకుడికి లేక పంపుతూ అక్టోబర్ 28వ తేదీన హాజరుకావాలని ఆదేశించినట్టు లెటర్లు పేర్కొన్నారు. ఇదంతా బాగానే ఉన్నప్పటికీ తాను నివసిస్తున్న పల్లె ప్రాంతానికి సంబంధించిన పోస్టల్ అధికారుల నిర్లక్ష్యమే తనకు ఉద్యోగం పోయిందని ఆరోపిస్తున్నాడు. తనకు పంపించిన ఆర్టిఐ కమిషన్ నుంచి వచ్చిన లేఖ అక్టోబర్ 28వ తేదీన అందాల్సి ఉండగా అక్టోబర్ 24న వచ్చిన ఆ లెటర్ గ్రామంలో ఉన్న పోస్టల్ అధికారుల అందివ్వకుండా లెటర్ వచ్చినట్టు వారే సంతకం చేసి డెలివరీ రిపోర్ట్ తిరిగి ఆర్టిఐ కమిషన్కు పంపించారు. ఇది తెలుసుకున్న యువకుడు సంబంధిత పోస్టల్ సిబ్బందిని నిలదీయగా ఆ యువకుడికి సంబంధించిన లెటర్ ను పోస్టల్ అధికారులు అందజేశారు. అప్పటికే ఆర్టిఏ ఆదేశించిన సమయం కాస్త పూర్తి అవ్వడంతో ఆర్టిఐ పిలిచిన సకాలంలోనే ఆ యువకుడు హాజరు కాకపోవడంతో ఆ యువకుడికి ఆసక్తి లేదని ఆ ఫిర్యాదును కొట్టి పారేశారు. దీంతో ఆ యువకుడు కన్నీరు మున్నీరై తనకు జరిగిన అన్యాయంపై న్యాయం కోరుతూ నిరీక్షిస్తున్నాడు.

పోస్టల్ శాఖ సిబ్బంది నిర్లక్ష్యం చేజార్చుకున్న ఉద్యోగం
గిరిజన యువకుడు శరత్ బాబు

తాను పూర్తిస్థాయిలో గ్రామీణ ప్రాంతాల్లో నివసించడమే నేను చేసుకున్న పాపమని మా గ్రామంలో ఉన్న పోస్టల్ శాఖ సిబ్బంది సకాలంలో లెటర్ అందిస్తే ఎస్సై కొలువును సాధించేవాడినని.. పోస్టల్ సిబ్బంది నిర్లక్ష్యం మూలంగానే తన ఉద్యోగం పోయిందని తక్షణమే పోస్టల్ సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని యువకుడు శరత్ బాబు డిమాండ్ చేస్తున్నాడు . తనకు ఆర్టిఏ ద్వారా వచ్చిన లెటర్ ను సిబ్బంది ముట్టినట్టు స్వయంగా సంతకం చేసి డెలివరీ రిపోర్ట్ ఎలా ఇస్తారు అని ప్రశ్నిస్తున్నాడు . పోస్టల్ శాఖ సిబ్బంది ఆలస్యంగా లెటరు తనకు ఇవ్వడం మూలంగానే సకాలంలో హాజరు కాలేక పోతే పోయానని సంబంధిత పోస్టల్ శాఖ అధికారికి జిల్లా ఎస్పీ కార్యాలయానికి ఈ నెల మూడో తేదీన లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశానన్నారు. అయినప్పటికీ తనకు న్యాయం జరగకపోగా ఇంతవరకు విచారణ చేపట్టడం లేదని వాపోతున్నాడు. కష్టపడి చదువుకొని ఉద్యోగం సంపాదించుకోవాలనుకున్న తన ఆశలను ఆవిరి చేశారని పోస్టల్ అధికారులు చేసిన చిన్ని తప్పిదమే తనకు శాపంగా మారిందని తనకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నాడు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

ఛాంబర్ కార్యవర్గాన్ని అభినందించిన..మంత్రి తుమ్మల

ఛాంబర్ కార్యవర్గాన్ని అభినందించిన..మంత్రి తుమ్మల కాకతీయ, ఖమ్మం ప్రతినిధి: ఛాంబర్ ఆఫ్ కామర్స్...

సజావుగా పంచాయతీ ఎన్నికల నిర్వహణకు సన్నద్ధంగా ఉండాలి

సజావుగా పంచాయతీ ఎన్నికల నిర్వహణకు సన్నద్ధంగా ఉండాలి రాష్ట్ర ఎన్నికల సంఘం కమీషనర్...

నిబంధనలు పాటిస్తేనే ధాన్యం కేటాయింపు

నిబంధనలు పాటిస్తేనే ధాన్యం కేటాయింపు మిల్ల‌ర్ల‌కు అదనపు కలెక్టర్ శ్రీనివాస రెడ్డి హెచ్చ‌రిక‌ రైస్...

హోంగార్డ్ ఉద్యోగుల ఆరోగ్య భీమాపథకంపై అవగాహన సదస్సు

హోంగార్డ్ ఉద్యోగుల ఆరోగ్య భీమాపథకంపై అవగాహన సదస్సు కాకతీయ, ఖమ్మం : హోంగార్డు...

ఎర్త్ సైన్స్ యూనివర్సిటీలో ఏర్పాట్లను పరిశీలించిన జిల్లా కలెక్టర్

ఎర్త్ సైన్స్ యూనివర్సిటీలో ఏర్పాట్లను పరిశీలించిన జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ కొత్తగూడెం,...

ఖమ్మం నరగంలో దారుణ హత్య

ఖమ్మం నరగంలో దారుణ హత్య భార్య ను గొంతు కోసి హత్య చేసిన...

పాఠశాలలను పరిశుభ్రంగా ఉంచాలి.

పాఠశాలలను పరిశుభ్రంగా ఉంచాలి. నాణ్యమైన విద్యను అందించడం ఉపాధ్యాయుల లక్ష్యం జూలూరుపాడులో రాష్ట్ర విద్యాశాఖ...

పాల్వంచ‌లో స‌మ‌స్య‌ల తిష్ట‌

పాల్వంచ‌లో స‌మ‌స్య‌ల తిష్ట‌ డ్రైనేజీలు, రోడ్లకు మ‌ర‌మ్మ‌తులు చేప‌ట్టాలి ఎంపీడీవోకు బీఆర్ ఎస్ నేత‌ల...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...

రేవంత్ కు కొత్త సవాల్!

* సర్కార్ కు పరీక్షగా సీఎస్ ఎంపిక? * ఈ నెలాఖరున రామకృష్ణారావు...

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం కాక‌తీయ‌, హైదరాబాద్ : రంగారెడ్డి జిల్లాలోని బాటసింగారంలో...

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన ప్రతిపాదించిన ప్రాజెక్టుపై...

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా న్యూ డిల్లీ జూలై...

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు మొన్న యూనివర్సిటీల్లో ఆందోళనలు నిషేధిస్తూ మెమో నేడు...

రాష్ట్రంలో హద్దులు దాటిపోతున్న ఫోన్‌ ట్యాపింగ్‌

రాష్ట్రంలో హద్దులు దాటిపోతున్న ఫోన్‌ ట్యాపింగ్‌ కాంగ్రెస్‌ దూత ఫోన్‌ ట్యాపింగ్‌..! గాంధీ...
spot_img

Popular Categories

spot_imgspot_img