కాకతీయ, బయ్యారం: రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థుల గెలుపుకు కాంగ్రెస్ కార్యకర్తలు కృషి చేయాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా యూత్ కార్యదర్శి తమ్మిశెట్టి వెంకటపతి అన్నారు. సోమవారం వారు మాట్లాడుతు ప్రజా ప్రభుత్వంలో చేపట్టిన సంక్షేమ పథకాలను పార్టీ కార్యకర్తలు గడపగడపకు వివరించాలని అన్నారు.
బిఆర్ఎస్ బిజెపిలను ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరని అన్నారు. రేవంత్ రెడ్డి అధికారంలోకి రావడంతోనే ప్రజా పాలన కొనసాగుతుందని తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పేదల సంక్షేమమే లక్ష్యంగా పని చేయడంతో పాటు రేవంత్ రెడ్డి నాయకత్వంలో ఇందిరమ్మ రాజ్యం దిశగా పరిపాలన సాగిస్తున్నా మన్నారు. రాబోవు స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బలపరచిన అభ్యర్థులను గెలిపించాలని ప్రజలను కోరారు.


