ఖమ్మం నరగంలో దారుణ హత్య
భార్య ను గొంతు కోసి హత్య చేసిన భర్త
కాకతీయ, ఖమ్మం: ఖమ్మం నగరం రెండవ పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ రోజు ఉదయం దారుణం చోటు చేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి కొత్త మున్సిపాలిటీ దగ్గర ,లయన్స్ క్లబ్ పక్క సందులో బాస్కర్ అనే వ్యక్తి తన భార్యను కత్తితో గొంతు కోసి అతి కిరాతకంగా హత్య చేసిన ఘటన చోటు చేసుకుంది.
మొదట కన్న కూతురుని చంపేందుకు కత్తి దూయడం తో ఆమె తండ్రి దాడి నుండి చాకచక్యంగా తప్పించుకునేందు కు చిన్నారి చేయిని అడ్డుపెట్టడం తో, కత్తి దాడి ఘటన లో తన చేతి వేళ్ళు మూడింటిని కోల్పోయినట్లు స్థానికులు తెలిపారు. అనంతరం భార్య పై దాడి చేసి ఆమె ను హత్య చేసినట్లు సమాచారం. ఈ విషయం తెలుసుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని నిందితుడు బాస్కర్ ను అదుపులోకి తీసుకున్నారు.గత కొంతకాలంగా భార్యాభర్తల మధ్య కొనసాగుతున్న కుటుంబ కలహాలు కారణంగా ఈ హత్య జరిగినట్లు తెలుస్తోంది. మృతురాలు సాయి వాణి (31)చింతకాని మండలం నేరడ గ్రామానికి చెందిన వారు కావడంతో, ఆమె కుటుంబ సభ్యులకు పోలీసులు సమాచారం అందించారు.


