పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి
లబ్ధిదారులకు సీఎం సహాయనిధి చెక్కుల పంపిణీ
కాకతీయ పాలకుర్తి: జనగామ జిల్లా పాలకుర్తి మండల కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో బుధవార ముఖ్యమంత్రి సహాయనిధి కింద మంజూరైన చెక్కులను ఎమ్మెల్యే యశస్విని రెడ్డి లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి పాలనలో ప్రతీ కుటుంబం భరోసా పొందేలా, అవసర సమయంలో ప్రభుత్వం అండగా నిలబడేలా చర్యలు తీసుకుంటోందని అన్నారు. సీఎం సహాయనిధి ద్వారా చికిత్స ఖర్చులు, ప్రమాదాలు, లేదా ఇతర అత్యవసర పరిస్థితుల్లో ఆర్థిక సహాయం అందించడం ద్వారా ప్రజల జీవితాల్లో కొంత ఉపశమనం కలుగుతుందన్నారు. కార్యక్రమంలో బ్లాక్ అధ్యక్షుడు రాపాక సత్యనారాయణ, మండల అధ్యక్షుడు కుమారస్వామి, వివిధ గ్రామపార్టీ అధ్యక్షులు, లబ్ధిదారులు పాల్గొన్నారు.
ప్రజలకు నాణ్యమైన సేవలు అందించాలి
ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో దేవరుప్పుల మండలానికి చెందిన విద్యుత్ శాఖ అధికారులతో ఎమ్మెల్యే యశస్విని రెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు. మండల వ్యాప్తంగా ఉన్న విద్యుత్ సరఫరా సమస్యలు, లోపాలు, మరమ్మతులు, ట్రాన్స్‌ఫార్మర్ల నిర్వహణపై విస్తృతంగా చర్చించారు. సమావేశంలో విద్యుత్ అంతరాయాలు, లోవోల్టేజ్ సమస్యలు, పురాతనమైన విద్యుత్ స్తంభాలు, వైర్లు మార్పిడి వంటి అంశాలపై ఎమ్మెల్యే అధికారులు నుంచి వివరాలు తీసుకున్నారు. ప్రతి గ్రామానికి ప్రాధాన్యత ప్రకారం పని ప్రణాళిక సిద్ధం చేసి తక్షణమే అమలు చేయాలని ఆదేశించారు. ప్రజలకు నాణ్యమైన సేవలు అందించడం ప్రభుత్వం ప్రధాన కర్తవ్యమని అన్నారు. ప్రమాదకరంగా వేలాడుతున్న విద్యుత్ తీగలను తొందరగా మార్పిడి చేసేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేయాలని ఆమె సూచించారు.


