భారత దేశ తొలి మహిళా ప్రధాని ఇందిరా గాంధీ
ఖమ్మం డీసీసీ అధ్యక్షుడు పువ్వాళ్ల, ఎంపీ రఘురామిరెడ్డి
కాకతీయ, ఖమ్మం : భారత దేశంలో తొలి మహిళా ప్రధాని గా ఇందిరా గాంధీ ఎన్నో సంస్కరణలు తీసుకువచ్చారని జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు పువ్వాళ్ళ దుర్గాప్రసాద్, పార్లమెంట్ సభ్యులు రామసహాయం రఘురామిరెడ్డి అన్నారు. బుధవారం కాంగ్రెస్ పార్టీ కార్యాలయం సంజీవరెడ్డి భవనంలో ఇందిరా గాంధీ జయంతిని పురస్కరించుకుని ఆమె చిత్ర పటానికి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇందిరా గాంధీ సేవలను కొనియాడారు. నాటి నుండి కూడా కాంగ్రెస్ పార్టీ మహిళా సాధికారతకు కట్టుబడి ఉందని అందులో భాగంగానే నేడు మన రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని పథకాలకు మహిళా పేరుతోనే పథకాలు అమలు చేయడం జరుగుతుందని తెలిపారు. అంతే కాకుండా ఇందిరమ్మ జయంతి సందర్భంగా నేడు కాంగ్రెస్ ప్రభుత్వం మహిళకు ఇందిరమ్మ చీరలు పంపిణీ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని అన్నారు. కార్యక్రమంలో వీరితో పాటు రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వరరావు, శాసనసభ మాజి సభ్యులు కొండబాల కోటేశ్వరరావు, శాసనమండలి మాజి సభ్యులు పోట్ల నాగేశ్వరరావు, బాలసాని లక్ష్మీనారాయణ,నగర కాంగ్రెస్ కమిటీ వర్కింగ్ ప్రెసిడెంట్ నాగండ్ల దీపక్ చౌదరి, రాష్ట్ర ఓబీసీ సెల్ నాయకులు వడ్డేబోయిన నరసింహారావు, బ్లాక్ కాంగ్రెస్ అద్యక్షులు యర్రం బాలగంగాధర్ తిలక్, పీసీసీసభ్యులు వడ్డే నారాయణరావు, పుచ్చకాయల వీరభద్రం, ఏఐసీసీ సేవాదళ్ కో ఆర్డినేటర్ చోటా బాబా, జిల్లా కాంగ్రెస్ నాయకులు చంద్రశేఖర్, జిల్లా ఆర్ టి ఏ మెంబర్ గజ్జెల్లి వెంకన్న, జిల్లా అనుబంధ సంఘ అధ్యక్షుడు దొబ్బల సౌజన్య, సయ్యద్ గౌస్,కార్పొరేటర్లు మలీదు వేంకటేశ్వరరావు, రాపర్తి శరత్, కన్నం వైష్ణవిప్రసన్న కృష్ణ, మాజి కౌన్సిలర్ పాలకుర్తి నాగేశ్వరరావు, జిల్లా ఓబీసీ సెల్ ఉపాధ్యక్షుడు గజ్జి సూర్యనారాయణ, నగర కాంగ్రెస్ పార్టీ అనుబంధ సంఘ అధ్యక్షులు బాణాల లక్ష్మణ్, షేక్ అబ్బాస్ బేగ్,గడ్డం వెంకటయ్య, బీరెడ్డి రమేష్, నూకారపు వేంకటేశ్వరరావు, కాళంగి కనకరాజు, జహీర్,జాకీర్ హుస్సేన్,యాసబోయిన శ్రీశైలం,రాంబాబు, కొంటెముక్కల నాగేశ్వరరావు, కిలారి అనిల్, భూక్యా సురేష్ నాయక్, వసీం,మహమూద్,బెజ్జం గంగాధర్, లింగాల రవికుమార్,జాని, ఫరీద్ ఖాద్రి, భవానీ, సుకన్య, లక్ష్మీ, ఉమాదేవి, శ్రీధర్ తదితర నాయకులు పాల్గొన్నారు.


