కాకతీయ, బయ్యారం: బయ్యారం మండలం లోని ఉప్పలపాడు గ్రామానికి చెందిన ఎన్.నవిత (25) అనే గర్భిణి 108 అంబులెన్స్ లో ప్రసవించింది. సోమవారం ఉదయం నవిత కు పురిటనొప్పులు రాగా 108 అంబులెన్స్‌కు సమాచారం అందించారు.సమాచారం అందుకున్న 108 బయ్యారం సిబ్బంది ఈఎంటీ చందా గర్భిణిని మహబూబాబాద్ ఏరియా ఆసుపత్రికి తరలిస్తుండగా పురిటినొప్పులు తీవ్రమయ్యాయి.
వెంటనే ఈ విషయాన్ని ఉన్నతాధికారులకు సమాచారం అందించి, వారి సూచనల మేరకు 108 వాహనంలో ప్రసవం జరిపించగా మగబిడ్డకు జన్మనిచ్చింది.తల్లి, బిడ్డ ఇద్దరు క్షేమంగా ఉండగా మెరుగైన వైద్య సేవల కోసం మహబూబాబాద్ ఏరియా ఆసుపత్రి కి తరలించారు.
అత్యవసర సమయంలో అప్రమత్తంగా వ్యవహరించిన 108 సిబ్బంది ఈఎంటీ చందా, పైలట్ నెహ్రు ను 108 జిల్లా మేనేజర్ బత్తిని మహేష్, ప్రోగ్రాం మేనేజర్ శివ కుమార్ అభినందించారు.



