జిల్లా వ్యాప్తంగా విస్తృతంగా వాహనాల తనిఖీలు
అనుమానాస్పద వ్యక్తుల ఫింగర్ ప్రింట్ మొబైల్ చెక్ ద్వారా వేలిముద్రలు సేకరణ
మద్యం మత్తులో పట్టుబడిన వారిపై కేసులు నమోదు
రోడ్డు ప్రమాదాలను అరికట్టే దిశగా మరింత పటిష్టమైన భద్రత చర్యలు
కాకతీయ, ఖమ్మం ప్రతినిధి: రాత్రివేళలోపెరుగుతున్న రోడ్డు ప్రమాదాలను అరికట్టే దిశగా మరింత పటిష్టమైన భద్రత చర్యలు చేపట్టాలని పోలీస్ కమిషనర్ సునీల్ దత్ పోలీస్ ఆదేశాల మేరకు మంగళవారం రాత్రి పోలీసులు ఎక్కడికక్కడ మోహరించి డ్రంకన్ అండ్ డ్రైవ్, వాహన తనిఖీలు చేపట్టారు.అనుమానాస్పద వ్యక్తుల ఫింగర్ ప్రింట్ మొబైల్ చెక్ ద్వారా వేలిముద్రలు సేకరించారు. మద్యం సేవించి పట్టుబడిన వాహనదారులను న్యాయస్థానంలో జైలు శిక్ష, జరిమానాలు విధించేలా పటిష్టమైన చర్యలు తీసుకుంటున్నారు.జిల్లాలో గుర్తించిన బ్లాక్ స్పాట్లలో బ్యారికేడింగ్, ప్రమాద సంకేత సూచిక బోర్డులు, స్టాపర్స్, సిగల్ లైట్స్, బ్లింకింగ్ లైట్స్ ఏర్పాటు చేసి ప్రమాద నివారణ చర్యలను చేపట్టారు.జాతీయ రహదారులపై నియంత్రణ లేని నిర్లక్ష్యమైన రాష్ డ్రైవింగ్, హెల్మెట్ ధరించకపోవడం, మద్యం మత్తులో డ్రైవ్, త్రిబుల్ రైడింగ్ చేయడం ద్వారానే ద్విచక్ర వాహనదారులు ఎక్కువ సంఖ్యలో ప్రమాదానికి గురై మరణిస్తున్నారని నివేదికలు చెపుతున్న నేపథ్యంలో అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో ప్రతి రోజు ఖచ్చితంగా డ్రంకెన్ & డ్రైవ్ తనిఖీలు, హెల్మెట్లు ధరించని వాహనదారులుపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని, తద్వారా ప్రమాదల సంఖ్య తగ్గించవచ్చని పోలీస్ అధికారులకు పోలీస్ కమిషనర్ సునీల్ దత్ అదేశించారు.ముఖ్యంగా మద్యం మాత్తులో రోడ్లపైకి వస్తున్న కొందరు వాహనదారులు, ఇతరుల ప్రాణాలకు ముప్పు తెస్తున్నారని, ఈ క్రమంలోనే ఇలాంటి వారిపై పోలీసులు ప్రత్యేక దృష్టి పెట్టాలని అదేశించారు.ఎక్కడైనా వాహనం బ్రేక్డౌన్ అయిన అప్పుడు పక్కన రాళ్లు చెట్టుకొమ్మలు పెడుతున్నారని, రాత్రి సమయాలలో అవి కనపడక ఆగి ఉన్న వాహనాలను ఢీకోట్టడం జరుగుతోందని, దానివల్ల కూడా ప్రమాదాల తీవ్రత పెరుగుతోంది అన్నారు..



